Telangana: పంట కోతకొచ్చిందని కోసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించింది చూడగా
పంట ఏపుగా కోతకు వచ్చిందని.. కోసేందుకు వెళ్లాడు ఓ రైతు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి దెబ్బకు దడుసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది.. ఆ వివరాలు ఇలా..
పంట పొలాలు చూసుకోవడానికి రైతులు వెళ్లారు. ఇప్పటికే కోతకు వస్తున్నాయి. ఎప్పుడు కోయ్యాలోనని చూడటానికి వెళ్లారు. ఇంతలో పసుపు, కుంకుమ.. మనిషి ఆకారం గల బొమ్మ కనబడింది. ఇంకేముంది.! రైతులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇప్పుడు పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామంలో పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చేతబడి చేయడంతో పక్కనే ఉన్న పంట పొలాల రైతులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. తమ పొలం పక్కనే గుర్తుతెలియని వ్యక్తులు మనిషిని పోలిన ఆకారంలో పట్టు పోసి, అందులో నిమ్మకాయలు పెట్టి, జిల్లేడు చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి, గుమ్మడికాయలు, కొబ్బరికాయలతో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి వీటిని చూసి పక్కనే ఉన్న పంట పొలాల రైతులు తీవ్ర భయాందోళన గురయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రైతు క్షుద్ర పూజలు ఎవరు చేశారో వారిని పంచాయతీ నిర్వహించారు. పెద్ద మనుషులు, ఇరువర్గాల మధ్యన ఘర్షణ తలెత్తింది. తమ ఇంట్లో ఓ వ్యక్తికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఊరు బయట ఓ మాంత్రికుడితో చేతబడి చేయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో పక్కనే పంట పొలానికి చెందిన రైతు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యాడు. దీంతో కోతకు వచ్చిన పంటను కూడా కోసేందుకు హార్వెస్టర్ కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో గ్రామంలోని పెద్దలు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి నమ్మకాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఇలాంటి పూజలు చూసి స్థానికులు భయపడుతున్నారు. చేతబడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..