AP News: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు

విద్యార్ధుల బాగు కోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కరికి రూ. 6 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ వివరాలు ఇలా..

AP News: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 14, 2024 | 9:30 AM

ఏపీ విద్యార్ధులకు కూటమి సర్కార్ అద్దిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది. ఒక్కో విద్యార్ధికి రూ. 6 వేలు ఆర్ధిక సాయం చొప్పున సుమారు రూ. 13.53 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇంతకీ ఈ ఆర్ధిక సాయం ఎందుకని అనుకుంటున్నారా.?

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు.. ‘సమగ్ర శిక్ష అభియాన్’ పథకం ప్రకారం సీఎం చంద్రబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విద్య హక్కు చట్టం ప్రకారం.. కిలోమీటరు దూరంలో ప్రాథమిక పాఠశాలలు, మూడు కిలోమీటర్ల లోపు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు.. ఐదు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలలు ఉండాలి. ఒకవేళ అంతకన్నా దూరంగా ఉంటే.. ఈ ఆర్ధిక సాయంతో విద్యార్ధులకు లబ్ది చేకూరనుంది. రాష్ట్రంలోని విద్యార్ధులు తమ నివాసానికి దూరంగా ఉండే పాఠశాలలకు వెళ్లేందుకు వీలుగా ఈ మొత్తాన్ని ట్రావెల్ అలవెన్స్‌‌లుగా ఉపయోగించుకోనున్నారు. సీఎం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 22, 550 మంది విద్యార్ధులకు లబ్ది పొందనున్నారు.

ఇది చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..