AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వీడి టాలెంట్ తగలబడా..! వయస్సు 26.. కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా!

రికార్డ్ నేను ఫాలో కాను రికార్డులే నన్ను ఫాలో అవుతాయి అంనుకుంటూ వరుస చోరిలతో దూసుకుపోతున్న అతడి వేగానికి పోలీసులకు కళ్ళెం వేశారు.

Andhra Pradesh: వీడి టాలెంట్ తగలబడా..! వయస్సు 26.. కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా!
Bikes Thief Arrest
B Ravi Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 14, 2024 | 9:35 AM

Share

అదమరపుగా ఉన్నారా.. ఇక అంతే..! మీరు ఏదైతే వాహనంపై అక్కడికి వచ్చారో.. ఆ వాహనం గోవిందా..! ఇక ఆ వాహనం మీకు కనిపించదు..! ఎందుకంటే దానిని ఎత్తుకుపోయే వ్యక్తి అంత టాలెంటెడ్ మరి. ద్విచక్ర వాహనాలను టార్గెట్‌ చేస్తూ ఆ ప్రాంతంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడు. సింగిల్ గా బైక్ అతని కంటికి కనిపించడమే పాపం దాన్ని క్షణాల్లో లేపేస్తాడు. ప్రస్తుతం ఆ కేటుగాడు పోలీసుల చేతికి చెక్కి ఊచలు లేక్కడెడుతున్నారు.

అయితే అతడు కొట్టేసింది ఒకటి రెండు బైక్లు అయితే కాదండి ఏకంగా 23 బైక్‌లను ఒక్కడే దొంగలించేశాడు. రికార్డ్ నేను ఫాలో కాను రికార్డులే నన్ను ఫాలో అవుతాయి అంనుకుంటూ వరుస చోరిలతో దూసుకుపోతున్న అతడి వేగానికి పోలీసులకు కళ్ళెం వేశారు. అసలు అంత నైపుణ్యం ఉన్న దొంగ ఎవరు, ఎక్కడి వాడు , ఒక్కడే ఇన్ని చోరీలు ఎలా చేయగలిగాడనే ఆసక్తి మిలో కనిపిస్తుంది కదా.. ఎందుకు ఆలస్యం చదివేయండి..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరిచర్లగుడానికి చెందిన పల్లంటి శ్రీనివాస్ అలియాస్ శ్రీను వయసు కేవలం 26 మాత్రమే కానీ గతంలో అనేక బైక్ చోరీ కేసులలో అతగాడు నిందితుడు. గత కొంతకాలంగా జంగారెడ్డిగూడెం రామచంద్రపురం ఏరియాలో శీను నివాసం ఉంటున్నాడు. జంగారెడ్డిగూడెం పరిసర చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రధానంగా ద్విచక్ర వాహనాలే టార్గెట్ గా చోరీలకు పాల్పడ్డాడు.

వ్యాపార సంస్థలు, షాపులు, రద్దీగా ఉన్న ప్రదేశాలలో రెక్కీ నిర్వహించేవాడు. ఆ సమయంలో ఎవరైనా బైక్ పై వచ్చి ఆదమరుపుగా బైక్ అక్కడ పెట్టి వారి పని ముగించుకుని బైక్ దగ్గరకు వచ్చేలోపు దానిని దొంగిలించేవాడు. అలా జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాలలో బైక్ దొంగతనం కేసులు ఎక్కువగా నమోదు కావడం మొదలయ్యాయి. దాంతో పోలీసుల సైతం బైక్ చోరీలకు కారణమైన దొంగను పట్టుకోవాలని ప్రత్యేకంగా నిఘా బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే చివరకు శ్రీను పోలీసుల చేతికి చిక్కాడు. దాంతో పోలీసుల విచారణలో అతడు దొంగిలించిన బైకుల వివరాలు రాబట్టి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఏకంగా 23 బైక్లను శ్రీను వద్ద నుంచి పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. అంతేకాక అతన్ని రిమాండ్ కు తరలించారు. శ్రీను వద్ద రికవరీ చేసిన 23 బైకుల విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాలు వాడే వ్యక్తులు వాటిని పార్క్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అదేవిధంగా రాత్రుళ్ళు బైకును కాంపౌండ్ వాల్ బయట కాకుండా లోపల సురక్షిత ప్రదేశాలలో పార్కింగ్ చేసుకోవాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర ద్విచక్ర వాహనదారులకు సూచించారు.

చోరీ చేసిన వెంటనే బైకును అమ్మలేక పోవటం , మంచి కొనుగోలు దారుడిని చూసుకుని అన్నింటిని ఒకేసారి అమ్మేద్దామనుకునేలోగానే పోలీసులు ఇతగాడిని కటకతాల వెనక్కు నెట్టారు. దీంతో 26 ఏళ్ళ వయస్సులో 23 బైకులు దొంగలించి 7 ఊసల మధ్య నిందితుడు శ్రీనివాస్ గడపాల్సి వచ్చంది..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..