Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నల్ల కోడి.. నిమ్మకాయ.. ఉలిక్కిపడ్డ జనం.. షేక్ చేస్తున్న క్షుద్ర పూజలు..!

ఇళ్ళ ముందు చంపి పడేసిన నల్లకోడి కళేబరాలు, కోడిగుడ్లు, నిమ్మకాయలు ఇతర పూజ సామాగ్రి ప్రత్యక్షమవడం చూసి హడలెత్తిపోతున్నారు.

Telangana: నల్ల కోడి.. నిమ్మకాయ.. ఉలిక్కిపడ్డ జనం.. షేక్ చేస్తున్న క్షుద్ర పూజలు..!
Black Magic
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Nov 14, 2024 | 10:05 AM

అర్ధరాత్రి ఇంటి ముందు ముగ్గులు.. అందులో నల్లకోడి, నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో క్షుద్ర పూజలు జరిపిన ఆనవాళ్లు..! ఎవరైనా ఆట పట్టించడం కోసం ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారో లేక ఏదైనా కీడు శంకించి చేస్తున్నారో ఏమో కానీ.. ఈ క్షుద్రపూజలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం సబ్ డివిజన్ ను షేక్ చేస్తున్నాయి. ఏకంగా ఇప్పుడు పోలీసులే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నళ్ళకోడి ముఠా జాడ కోసం గాలిస్తున్నారు.

వరుస క్షుద్రపూజల ఘటనలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహదేవపూర్ మండలాన్ని వణికిస్తున్నాయి. రోజుకోచోట క్షుద్ర పూజలు జరిపిన ఆనవాళ్లు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కొందరు అనారోగ్య సమస్యలతో.. మరికొందరు శత్రుపీడ వినాశనం కోసం.. ఇంకొందరు ఎదుటివారి ఎదుగుదలను ఓర్వలేక వారి ఇళ్ళ ముందు క్షుద్రపూజలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నల్ల కోడిని చంపి వదిలేయడం, కోడిగుడ్లు తిప్పి వదిలేయడం, నిమ్మకాయలు తిప్పి ఇండ్ల ముందు వదిలేయడం హదలెత్తిస్తుంది. కొందరు గ్రామ పొలిమేరలో క్షుద్ర పూజలు నిర్వహించడం ఈ మధ్య తరచుగా చూస్తున్నారు. ఏకంగా సిసి కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్‌ కావడం కలవరం సృష్టిస్తోంది.

క్షుద్రపూజల భయంతో ఇక్కడి ప్రజలు బయటకు వెళ్లాలంటే రాత్రిపూట భయంతో వణికి పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ తాంత్రిక పూజలు నిర్వహించేవారు ఎవరిని బలి తీసుకుంటారో అనే భయం పట్టుకుంది. కొందరు మహాదేవపూర్ పరిసర ప్రాంత అడవుల్లో ఈ క్షుద్ర పూజలు నిర్వహిస్తుంటే మరికొందరు గ్రామ పొలిమేరలో పూజలు చేస్తున్నారు.. ఇంకొందరు దుర్మార్గులు అయితే ఏకంగా ఇండ్ల ముందే క్షుద్రపూజలు నిర్వహించి, శత్రు సంహారాన్ని కోరుకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.

తెల్లవారేసరికి ఇళ్ళ ముందు క్షుద్రపూజల జరిపిన ఆనవాళ్లు చూసి ఇక్కడ ప్రజలు గజగజ వణికిపోతున్నారు.. ఏకంగా ఇళ్ళముందు చంపి పడేసిన నల్లకోడి కళేబరాలు, కోడిగుడ్లు, నిమ్మకాయలు ఇతర పూజ సామాగ్రి ప్రత్యక్షమవడం చూసి హడలెత్తిపోతున్నారు. కొన్ని సంఘటనలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి.

మహాదేవాపూర్ – కాటారం మధ్య ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి ముసుగు ధరించి వచ్చి ఇంటి ముందు పూజలు నిర్వహించడం, నల్ల కోడిని చంపి ఇంటి ముందు వదిలేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఆధారంగా పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు..

అయితే క్షుద్ర పూజల ఘటనలు రోజుకోచోట వెలుగు చూస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు..కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.. ఎవరైనా క్షుద్ర పూజలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. నళ్ళకోడి పెంపకపుదారులపై కూడా ఫోకస్ పెంచారు.. ప్రజలు కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి భయాందోళన చెందవద్దని భరోసా కల్పిస్తున్నారు.

మరిన్ని హ్ల్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..