దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు.. అంతలోనే షాకింగ్.!

దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు.. అంతలోనే షాకింగ్.!

Anil kumar poka

|

Updated on: Nov 14, 2024 | 11:24 AM

కార్తీకమాసం కావడంతో దేశవ్యాప్తంగా ఆథ్యాత్మిక శోభ కనిపిస్తోంది. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులంతా శివకేశవ ఆలయాలను సందర్శించి పూజలు, ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. ఎంతో భక్తితో దైవదర్శనానికి వెళ్లి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే భగవత్‌ సన్నిధికి చేరిపోయాడు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం విష్ణువర్ధన్‌ అనే యువకుడు కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ 1 లోని అమ్మ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడు రోజూ ఉదయం స్థానిక వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళుతుంటాడు. కార్తీకమాసం, మంగళవారం కావడంతో విష్ణువర్ధన్‌ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి అలసటగా అనిపించి పక్కనే ఉన్న వాటర్ ఫిల్టర్‌ వద్దకు వెళ్లి మంచి నీళ్లు తాగాడు. ఆ తర్వాత మళ్లీ ప్రదక్షిణలు కొనసాగించాడు. ఈ క్రమంలో విష్ణుకి కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఆలయంలోని ఓ స్థంభాన్ని పట్టుకుని సేదదీరే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆలయ అర్చకులు భక్తులు విష్ణువుని లేపడానికి ప్రయత్నించారు. కానీ విష్ణువులో ఎలాంటి చలనం లేకపోవడంతో.. చివరకు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. విష్ణుని పరిశీలించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం విష్ణు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దైవ దర్శనానికి వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగిరావడం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.