Viral: కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
ఒడిశాలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. బోరిగుమ్మ బ్లాక్ పరిధిలోని నౌగూడ గ్రామ పరిసరాల్లోని ఓ ప్రాంతంలో తవ్వకాలు జరపగా పవిత్రమైన శివలింగం బయటపడింది. ఆ ప్రాంతం ఇప్పుడు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం అక్కడికి భక్తులు పోటెత్తుతున్నారు. స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం,
ఇటీవల ఆ ప్రాంతంలో ఒక భారీ మర్రి చెట్టు కూలిపోయింది. ఆ ప్రాంతానికి వెళ్లిన నౌగూడ నివాసి సమీర్ మెటల్ డిటెక్టర్ ఉపయోగించి చెట్టు కింద శివలింగం ఉండటాన్ని గమనించాడు. విషయాన్ని గ్రామస్థులకు తెలియజేయడంతో.. వారు కొన్ని మీటర్ల లోతు వరకు మట్టిని తవ్వి భూమి కింద ఉన్న శివలింగాన్ని వెలికితీశారు. ఈ అద్భుత ఆవిష్కరణను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో నౌగూడ గ్రామానికి పోటెత్తారు. ఇది కార్తీక మాసం కావడంతో శివయ్య దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. బయల్పడిన శివలింగం దగ్గర నిత్యం పూజలు జరుగుతున్నాయి. స్థానికులు అక్కడ చిన్న పందిరి ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు. శివలింగ దర్శనానంతరం భక్తులు గ్రామస్తుల ఏర్పాట్లను మెచ్చుకుంటున్నారు. మరోవైపు, శివలింగం బయల్పడిన ఆ ప్రాంతంలో గుడి కట్టాలని పలువురు కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

