AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో కారు బీభత్సం..  డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.

Hyderabad: హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.

Noor Mohammed Shaik
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 14, 2024 | 1:27 PM

Share

హైదరాబాద్‌లోని నాంపల్లిలో బుధవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రెడ్‌హిల్స్ నీలోఫర్ కేఫ్ దగ్గర రోడ్డు పక్క నిల్చొని ఉన్న జనాలపైకి కారు దూసుకెళ్లడంతో పలువురు గాయపడ్డారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కారు నడపడంతో ప్రమాదానికి కారణమయ్యాడు ఓ వ్యక్తి. స్థానికులు గమనించి ఆ వ్యక్తిని చితకబాదారు.

నాంపల్లిలో జరిగిన కారు బీభత్సం ఘటనకు మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు నడపడమే కారణంగా తెలిసింది. కారు అదుపు తప్పడంతో పలువురు గాయాల పాలయ్యారు. ఇది గమనించిన అక్కడే ఉన్న స్థానికులు వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. ఘటనాస్థలికి చేరుకుని కారు నడిపిన వ్యక్తిని నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పారిపోతున్న వ్యక్తిని కిలోమీటర్ల మేర వెంటాడి తరిమి తరిమి కొట్టి స్థానికులు పోలీసులకు అప్పజెప్పడం గమనార్హం. విచక్షణ కోల్పోయి మద్యం తాగినప్పుడు వాహనం నడపరాదనే కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రజల ప్రాణాలు తీసే ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా మద్యం తాగి వాహనాలు నడిపేవారిని పోలీసు శాఖ కట్టడి చేయాలని కోరారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Nov 14, 2024 11:43 AM