క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ?? ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
ఎవరైరా తమ విరోధులపై కక్ష తీర్చుకోడానికి వారిని ఏదోరకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారితో తరచూ గొడవలు పడటం లేదా పోలీసు కేసులు పెట్టి కటకటాల్లోకి పంపడం చేస్తుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏదైనా వెంటనే జరిగిపోవాలి. న్యాయం కోసం ఎదురు చూసేంత ఓపిక ఇప్పుడు చాలామందిలో లేదు.
అందుకే అలాంటివారు ట్రెండ్ మార్చారు. శత్రువుల వినాశనం వెంటనే జరగాలని కోరుకుంటున్నారు. దీనికోసం క్షుద్ర పూజలు చేయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్షుద్ర పూజల మూర్ఖులు పెరిగిపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోజుకోచోట క్షుద్ర పూజలు వెలుగులోకి వస్తున్నాయి. ముసుగు ధరించి వచ్చిన ఓ వ్యక్తి.. ఓ ఇంటి ముందు ఎలా క్షుద్రపూజలు నిర్వహించారో చూసి అక్కడివారు ఆందోళన చెందుతున్నారు. ఆ ముసుగు మాంత్రికుడి క్షుద్రపూజలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో వెలుగు చూసిన క్షుద్రపూజలు కలకలం రేపాయి. కాటారం-మహాదేవపూర్ ప్రధాన రహదారి పక్కనే పోచిరెడ్డి అనే వ్యక్తి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తి క్షుద్రపూజలు నిర్వహించాడు. ముసుగు ధరించి వచ్చిన ఆ వ్యక్తి క్షుద్రపూజలు నిర్వహించడం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. తెల్లవారి లేచి చూసేసరికి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నల్ల కోడి, నిమ్మకాయలు, కోడిగుడ్లు ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. సీసీ కెమెరా ఫుటేజ్ చూసి షాక్ అయ్యారు. ఆ ముసుగు వ్యక్తి ఎవరై ఉంటారా అని ఆరా తీస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

