మనుషులను అనుకరించే పక్షి గురించి మీకు తెలుసా..?
TV9 Telugu
13 November 2024
మనుషులను త్వరగా అనుకరించే పక్షి ఏంటి అంటే ఠక్కున గుర్తుకు వచ్చేదీ చిలుక. ఇది అందరికి తెలిసిన విషయమే.
చిలుకలు అన్ని పక్షులతో పోలిస్తే బాగా తెలిసినవి. మానవుల మాటలను అనుకరించే ఇతర పెంపుడు పక్షులు కూడా చాల ఉన్నాయి.
చిలుకలు మాత్రమే కాకుండా మనుషుల స్వరాలను ఇట్టే పసిగట్టే చెప్పే మరో పక్షి కూడా ఉందన్న విషయం మీకు తెలుసా?
మైనా పక్షులు, ఒక రకమైన కార్విడ్, స్టార్లింగ్‌లకు సంబంధించినవి. ఈ పక్షులు మనుషులను బాగా అనుకరిస్తాయి.
మనుషులను అనుకరించడంలో నిష్ణాతులైన ఈ పక్షి పేరు పహారీ మైనా. దట్టమైన అడవులలో ఎక్కువగా కనిపిస్తుంది మైనా అనే పక్షి.
పహారీ మైనా పక్షి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రనికి రాష్ట్ర పక్షి. మైనా అనే పక్షి శాస్త్రీయ నామం గ్రాకులా రిలిజియోసా.
సాధారణంగా ఒక మందలో వాటి సంఖ్య 2 నుండి ఎనిమిది వరకు మాత్రమే ఉంటుంది. పర్వత మైనా జాతి క్రమంగా అంతరించిపోతోంది.
భారతదేశంతో పాటు, ఇది నేపాల్, భూటాన్, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్ మొదలైన దేశాలలో కూడా కనిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి