ఇది పిచ్చి మొక్క కాదు.. రోగాలను తరిమికొట్టే రామబాణం!

Jyothi Gadda

13 November 2024

TV9 Telugu

అతిబలకు సంబంధించి సూపర్ స్ట్రాంగ్ జ్యూస్, పౌడర్ రూపంలో మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. అతిబల మొక్క ఉపయోగాలు, ఏయే వ్యాధులను నయం చేయవచ్చో తెలుసుకుందాం.

TV9 Telugu

ఆయుర్వేదం ప్రకారం, అతిబల మొక్క, దాని పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జలుబు, దగ్గు ప్రభావాలను తొలగించడంలో అతిబల అద్భుతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

TV9 Telugu

అతిబల చెట్టుని ముదురు బెండ చెట్టు అని కూడా అంటారు. ఇది పల్లెల్లో విరివిగా దొరుకుతుంది. దీని పూలు పసుపు పచ్చగా ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. 

TV9 Telugu

పేరులో ఉన్నట్టుగానే అతిబల చెట్టు శరీరానికి అధిక బలాన్ని ఇస్తుంది. దీని ఆకుల రసాన్ని వారానికి రెండు, మూడు సార్లు తీసుకుంటే నీరసం, నిస్సత్తువ తగ్గి శరీరం ఆక్టివ్ స్టేజ్ లోకి వెళ్తుంది.

TV9 Telugu

కంటి సమస్యలను తగ్గించడంలో అతిబల బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముదురు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో మూసిన కళ్ళను కడుగుతూ ఉంటే కంటి చూపు మెరుగవుతుంది.

TV9 Telugu

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు నాలుగు ముదురు బెండ ఆకులను తీసుకుని, ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. 

TV9 Telugu

ఇందులో కండ చక్కెర లేదా పటిక బెల్లం కలిపి, రోజుకు మూడుసార్లు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. మూత్రణాల ఇన్ఫెక్షన్లు, జ్వరం, మూత్రం మంటను తగ్గిస్తుంది.

TV9 Telugu

కీళ్లు, మోకాళ్ల నొప్పులకు అతిబల కాండాన్ని బండపై రాయగా వచ్చిన గంధంతో లేపనంగా వేస్తే ఫలితం ఉంటుంది. వారం రోజులపాటు చేస్తే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది.

TV9 Telugu