Bandi Sanjay: ‘కుల గణన పేరుతో ప్రజల ఆస్తిపాస్తులపై కన్నేశారు’.. రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం (నవంబర్ 13) నాగ్ పూర్ లో పర్యటించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay: ‘కుల గణన పేరుతో ప్రజల ఆస్తిపాస్తులపై కన్నేశారు’.. రేవంత్  ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay Kumar
Follow us
Basha Shek

|

Updated on: Nov 13, 2024 | 10:40 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కుల గణన కార్యక్రమం ప్రజల ఆస్తిపాస్తులు కాజేయడానికేనంటూ వ్యాఖ్యానించారు. ‘తెలంగాణలో 15 పర్సంట్ కమీషన్ పాలన నడుస్తోంది. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్కటీ కూడా అమలు చేయలేదు.ఇప్పుడుకోట్ల యాడ్స్ ఇచ్చి మహారాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు. తెలంగాణ పైసలన్నీ మహారాష్ట్రలో ఖర్చు చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లను సుప్రీంకోర్టే కొట్టేసింది. అయినా మైనారిటీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేసే కుట్ర జరుగుతోంది. ఇక కుల గణన పేరుతో ప్రజల ఆస్తిపాస్తులపై కన్నేశారు. ఛత్రపతి శివాజీ వారసులారా…. మొగల్స్ కోటను బద్దలు కొట్టిన చరిత్ర మీది. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టండి’ అని మహారాష్ట్ర ఓటర్లకు పిలుపునిచ్చారు బండి సంజయ్.

కాగా నాగ్ పూర్ పట్టణంలో గల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సంస్థ కేంద్ర కార్యాలయాన్ని  బండి సంజయ్ సందర్శించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చిన ఆయన అక్కడి నిర్వహకులతో చాలా సేపు మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

నాగ్ పూర్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..