AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అయ్యబాబోయ్.. ఇవేంటి ఇలా ఉన్నాయ్..చేపలా లేక పాములా..?

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్యకారుల పంట పండింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌లో అనకాపల్లి జిల్లాకు చెందిన మత్స్యకారుల వలకు కుప్పలు తెప్పలుగా ఈల్ ఫిష్ చేపలు చిక్కాయి.పదుల సంఖ్యలో కుప్పలు తెప్పలుగా ఈల్ చేపలు బయటపడడంతో మత్స్యకారులకు పట్టలేని ఆనందం వచ్చింది.

AP News: అయ్యబాబోయ్.. ఇవేంటి ఇలా ఉన్నాయ్..చేపలా లేక  పాములా..?
Fishermen's Caught Eel Fish In Konaseema
Pvv Satyanarayana
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Nov 14, 2024 | 11:58 AM

Share

అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌లో అనకాపల్లి జిల్లాకు చెందిన మత్స్యకారుల వలకు కుప్పలు తెప్పలుగా ఈల్ ఫిష్ చేపలు చిక్కాయి. దీంతో మత్స్యకారుల పంట పండింది. పదుల సంఖ్యలో కుప్పలు తిప్పలుగా ఈల్ చేపలు బయటపడడంతో మత్స్యకారులకు పట్టలేని ఆనందం వచ్చింది. ఒకేసారి అన్ని ఈల్ ఫిష్ చేపలు చూసి అవాక్కయ్యారు వేటకు వెళ్లిన మత్స్యకారులు ..ఈ చేపలు పొట్ట భాగంలో ఉండే తెల్లటి బుడగ లాంటి అవయవాన్ని మందులు (మెడిసిన్ ) తయారీకి ఉపయోగిస్తారని, దీనికి ధర మార్కెట్లో రూ.300/- వరకు పలుకుతుందని మత్స్యకారులు చెప్తున్నారు.

చేపల పెంపకం మంచి ఉపాధి మార్గంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో యువత బాగా ఆకర్షితులవుతున్నారు. దీంతో పాటు చేపల ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిస్తున్నారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు, మత్స్యకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకాల వల్ల మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారు. భారతదేశంలో ఫిషింగ్ మరియు ఆక్వాకల్చర్ రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. మొత్తం వాటాలో 40.9% వాటాను కలిగి ఉంది. దీని తర్వాత పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ ఉన్నాయి. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల ఉత్పత్తి విలువపై గణాంకాల కార్యాలయం ఇటీవల నివేదిక వెల్లడించింది. జాతీయ ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్ వాటా 2011-12లో 24.6% నుండి 2022-23లో 14.4%కి తగ్గింది. ఒడిశా మరియు బీహార్ పెరిగాయి.

చేపలు తినడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. చేపల్లో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఈ ఆమ్లాలు శరీరం పెరుగుదల, బలానికి ఉపయోగపడతాయి. చేపలలో ఒమేగా-2 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కొవ్వు చేపలలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడులోని న్యూరాన్ల అభివృద్ధిని స్థిరీకరించడంలో సహాయపడతాయి. ఇది మెదడు  సామర్థ్యాన్ని శక్తిని పెంచుతుంది. చేపలలో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి, ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి