AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం.. రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు

ఏపీలో మరో ఆధ్యాత్మీక కేంద్రం ముస్తాబవుతోంది. సుమారు 800 ఏళ్ల చరిత్ర కలిగిన గుడిమెల్లంకలోని శ్రీ విద్యా భారతి శంకర మఠం మరింత అభివృద్ధి చేసే దిశగా పిఠాధిపతులు అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం 300 కోట్ల రూపాయలతో పలు పనులకు భూమిపూజ, శంకుస్థాపనకు అంకురార్పణ చేయనున్నారు.

AP News: ఏపీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం.. రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు
Gudimellanka Village
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Nov 14, 2024 | 9:03 AM

Share

కోనసీమ జిల్లా గుడిమెల్లంక గ్రామానికి రానున్న ఆధ్యాత్మిక శోభ…ఆంధ్ర రాష్ట్రంలో ఆధ్యాత్మిక కేంద్రంగా గుడిమెల్లంక గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా పీఠాధిపతులు అడుగులు వేస్తున్నారు. 300 కోట్ల రూపాయలతో శ్రీ ఉమా లక్ష్మనేశ్వర స్వామి ఆలయం, శ్రీ విద్యా భారతి శంకరమఠం, గోశాల, గజశాల, అశ్వశాల, వాహనశాల, పాఠశాల, అత్యంత పురాతనమైన గ్రంథాలయంనకు శంకుస్థాపనకు అంకురార్పణ చేయనున్నారు.

శంకుస్థాపన కార్యక్రమానికి శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యా భారతీ తీర్థ మహాస్వామి, శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వార్లు ఈ నెల 25 న గుడిమెల్లం గ్రామానికి విచ్చేయుచున్నారు.ఈ నెల 24,25,26 మూడు రోజులు గుడిమెల్లంకలోని బస చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వాదాలు అందించనున్నారు..గుడిమెల్లంకలోని శ్రీ విద్యా భారతి శంకర మఠం చరిత్ర చూస్తే 800 ఏండ్ల చరిత్ర కలిగిన మంగళంపల్లి వారి వీధిలో ఉన్న శ్రీ విద్యా భారతి శంకరమఠం.వీరు పెద్దలు రచించిన గ్రంధాలు శృంగేరి పీఠంలో భద్రపరచడం విశేషం…శ్రీ ఉమా లక్ష్మనేశ్వర స్వామి వారి దేవాలయం చరిత్ర కూడా ఉంది.

శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతా సమేతంగా రామలక్ష్మణులు గుడిమెల్లంక గ్రామంలో బస చేసి ఉన్నప్పుడు శ్రీరామునికి శివ పూజకు వేళ కావడంతో అప్పటికప్పుడు లక్ష్మణుడు శివలింగాన్ని ఏర్పాటు చేసిన ప్రదేశం నేడు శ్రీ ఉమా లక్ష్మనేశ్వర స్వామి దేవాలయంగా కొలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం గుడిమెల్లంక గ్రామంలో రానున్న రోజుల్లో మరొక ఆధ్యాత్మిక కేంద్రం కాబోతున్న నేపథ్యంలో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. .. శృంగేరి పీఠాధిపతులు ఆర్థిక సహకారంతో శిధిలావస్థలో ఉన్న శ్రీ లక్ష్మనేశ్వర స్వామి ఆలయం, విద్యా భారతి శంకరమఠం, గోశాల, గజశాల, అశ్వశాల, వాహన శాల, చతుర్వేద పాఠశాల, అత్యంత పురాతనమైన గ్రంథాలయం శంకుస్థాపనకు శృంగేరి పీఠాధిపతులు మూడు రోజులు పాటు ఇక్కడే బస చేసి సమర్పణ, పాత పూజలు, జగద్గురువులచే భక్తులకు మంత్రక్షతలు, ప్రసాద్ వితరణ జరుగును. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు దీంతో మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామం ఆధ్యాత్మిక శోభన సంతరించుకొనుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా ఏర్పాటు చేస్తున్నారు శ్రీ విద్యా భారతి శంకరమఠం పండితులు .

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..