- Telugu News Photo Gallery Shiva Lingam under the Root of a Coconut Tree In P.Gannavaram Konaseema District
కార్తీక మాసంలో మహాద్భుతం.. కొబ్బరి చెట్టు వేర్ల మధ్య శివలింగం ప్రత్యక్షం..!
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో అద్భుతం చోటు చేసుకుంది. కొబ్బరి చెట్టు మొదలులో సూక్ష్మ శివలింగం ప్రత్యక్షమైంది. సోమవారం రోజు సూక్ష్మ శివలింగం కనిపించడంతో భక్తులు పూజలు చేయడానికి క్యూ కట్టారు. కార్తీక మాసం పర్వదినంలో స్వయంగా శివుడే ప్రత్యక్షమయ్యాడంటూ స్థానిక మహిళలు క్యూ కట్టి అభిషేకాలు చేస్తున్నారు.
Updated on: Nov 12, 2024 | 2:01 PM

పి.గన్నవరం బొడపాటివారిపాలెం వద్ద ప్రధాన రహదారి చెంతనే ఉన్న కొండాలమ్మ, శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాలు వెనుక భాగంలో ఉన్న కొబ్బరి చెట్టు వద్ద శివలింగం కనిపించింది. కార్తీక మాసం సోమవారం రోజూ భక్తులకు శివలింగం కనిపించింది. శివునికి ప్రీతి కరమైన రోజున పంచలోహాలతో కూడిన సూక్ష్మ శివలింగం బయటపడడం తో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నరు స్థానికులు.

స్వప్న అనే భక్తురాలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవునికి దండం పెట్టుకొని బయటకు వస్తున్న సమయంలో నల్లత్రాచు పాము కనబడిందట.. ఆ పాము ఎటు వెళుతుందని చూస్తుండగా, కొబ్బరి చెట్టు వరకు వెళ్లిన ఆ పాము అక్కడే మాయమైందని అంటున్నారు.

ఎక్కడైతే పాము కనిపించకుండా పోయిందో.. అక్కడే వారికి ఈ వింత దృశ్యం కనిపించిందట. పాము కనిపించకుండా పోయిన చోట ఉన్న కొబ్బరి చెట్టు మొదలు వద్ద వద్ద వశివలింగం కనిపించిందని ఆ భక్తురాలు చెబుతోంది.

ఈ విషయం ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. కార్తీక మాసం సోమవారం రోజున ఆ పరమశివుడే ప్రత్యక్షమయ్యాడంటూ పెద్ద ఎత్తున ఇక్కడకు తరలివచ్చిన గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. శివునికి ప్రీతి కరమైన సోమవారం రోజునే పంచలోహాలతో కూడిన సూక్ష్మ శివలింగం బయటపడడం తో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నరు స్థానికులు.

నిన్నటి నుండి శివలింగాన్ని దర్శించుకోవడానికి చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి శివలింగానికి పూలు పండ్లు పెట్టి బాలభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నరు. అయితే ఇది ఎవరైనా కావాలని చేశారా లేక నిజంగానే వెలిసిందా అనేది తెలియాల్సి ఉంది..
