- Telugu News Photo Gallery Cinema photos North Distributors says about all single screens only for Pushpa 2 the rule craze in north, Details here
Pushpa 2: బన్నీకి సైడ్ ఇస్తున్న ఆ హీరో ఎవరు.? పుష్ప మేనియా మామూలుగా లేదుగా..
ఇండస్ట్రీలో ఒకరి ఊత పదాలను ఇంకొకరు పలకడం మామూలైపోయింది. అల్లు అర్జున్ తగ్గేదేలే అంటే, మిగిలిన హీరోలందరూ ఆ మేనరిజాన్ని ఫాలో అయ్యారు. రీసెంట్‌గా జరగండి జరగండి అంటూ రామ్‌చరణ్ అంటున్న మాటలను బన్నీ కూడా పలుకుతున్నారు. ఇంతకీ బన్నీ జరగండి జరగండి అంటే జరుగుతున్న హీరో ఎవరు.? పుష్ప మేనియా మామూలుగా లేదంటూ ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్స్ మీట్‌లో నార్త్ డిస్ట్రిబ్యూటర్ గట్టిగా చెప్పేశారు.
Updated on: Nov 12, 2024 | 3:01 PM

ఇండస్ట్రీలో ఒకరి ఊత పదాలను ఇంకొకరు పలకడం మామూలైపోయింది. అల్లు అర్జున్ తగ్గేదేలే అంటే, మిగిలిన హీరోలందరూ ఆ మేనరిజాన్ని ఫాలో అయ్యారు.

రీసెంట్‌గా జరగండి జరగండి అంటూ రామ్‌చరణ్ అంటున్న మాటలను బన్నీ కూడా పలుకుతున్నారు. ఇంతకీ బన్నీ జరగండి జరగండి అంటే జరుగుతున్న హీరో ఎవరు.?

పుష్ప మేనియా మామూలుగా లేదంటూ ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్స్ మీట్‌లో నార్త్ డిస్ట్రిబ్యూటర్ గట్టిగా చెప్పేశారు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో పుష్పరాజ్ ఆగమనం కోసం అందరూ వెయిటింగ్ అని డిక్లేర్ చేశారు.

ఇప్పుడు ఆ విషయాన్ని బలపరిచేలా ఇంకో టాపిక్ వినిపిస్తోంది. పుష్ప సీక్వెల్ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఆఫ్టర్ కోవిడ్ మహారాష్ట్రలోని రూరల్ ఏరియాల్లోని సింగిల్ స్క్రీన్స్ కి బాగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమా పుష్ప.

పాట్నాలోని గాంధీ మైదానంలో దాదాపు రెండు లక్షల మంది అభిమానుల సమక్షంలో పుష్ప 2 ట్రైలర్‌ని లాంచ్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ - సుకుమార్ కలిసి రెండేళ్లు చేసిన మ్యాజిక్‌కి పేరు పుష్ప2.

ఎగ్జిబిటర్స్ నిర్ణయం విన్న వెంటనే తమ సినిమాను జనవరి 10కి వాయిదా వేసుకున్నారట చావా మేకర్స్. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన చావా సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయాలన్నది ప్రీవియస్ ప్లాన్.

అయితే ఇప్పుడు థియేటర్లన్నీ పుష్ప సీక్వెల్‌కి వెళ్లడంతో ప్లాన్ బీని ఫాలో అవుతున్నారట. ఈ లెక్కన డిసెంబర్‌లో పుష్పతో, జనవరిలో చావాతో ఆడియన్స్ ని పలకరించనున్నారు రష్మిక.




