ఆదివాసుల ఆరోగ్య రహస్యం కొండ జొన్న.. ఆ హైట్ చూస్తే అవాక్కే..!
చిన్న పిల్లలనుండి వృద్ధుల వరకు కొండజొన్న గడక, అంబలిని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఇది తిన్న వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని.. సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని...ఆదివాసీలు చెబుతున్నారు.. చర్ల మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు..
భద్రాచలం ఏజెన్సీ లో ఆదివాసులు ఆహార అలవాట్లు భిన్నంగా ఉంటాయి..అడవుల్లో ,కొండల్లో దొరికే పండ్లు , కూరగాయలు, ఆకుకూరలు,వాళ్ళు స్వయంగా తయారు చేసుకున్న ఆహార పదార్థాలే ..కల్తీ లేని ఆహార పదార్థాలే తింటారు..అందుకే ఇక్కడ ఆదివాసులు దృఢంగా ,ఆరోగ్యంగా ఉంటారు . స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, కల్మషం లేని మనషులు ఆరోగ్యంగా ఉండే ఆదివాసి జీవన రహస్యంలో కొండజొన్న ఒకటి. ఆదివాసీల పెరటి స్థలంలో ఎంతో మక్కువగా పెంచుకుని కొండజొన్నను అంబలిలో కాచుకుని త్రాగే ఈ జొన్న తోట ఏకంగా 15 అడుగులు పెరగడంతో దాన్ని చూడాలంటే తల ఎత్తాల్సిందే. ఆరు నెలల్లో వచ్చే ఈ పంటకు నాటు కోడి ఎరువును వాడటమే అసలు రహస్యం అంటున్నారు ఇక్కడి రైతులు.
చిన్న పిల్లలనుండి వృద్ధుల వరకు కొండజొన్న గడక, అంబలిని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. ఇది భుజించిన వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని.. సర్వరోగి నివారిణిగా పనిచేస్తుందని…ఆదివాసీలు చెబుతున్నారు.. చర్ల మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు కన్నారావు తన తోటలో చెరకు గడలను తలపించే ఈ జొన్న మొక్కలకు మూడు అడుగుల మేర వేర్లు వచ్చి ఏపుగా పెరగడంతో అందరి చూపు కొండజొన్న పైనే ఉంది.
వింతగా చూసిన వాళ్లు జొన్నతోటకు వెళ్లి తమ ఎత్తును చూసుకుని మూడింతలు ఎక్కువవుందని ఆశ్చర్యపోతున్నారు…ఎలా సాగు చేశారు..మెలకువలు ఈ రైతు దగ్గర తెలుసు కుంటున్నారు..ఇతర ప్రాంతాల వారు ఇక్కడకు వచ్చి దీన్ని గురించి ఆసక్తిగా తెలుసు కుంటున్నారు..విపరీతమైన పురుగు మందులు , కెమికల్స్ వాడిన పంటలు ,ఆహార పదార్థాలే అనేక రోగాలకు కారణం అవుతోంది..మనమూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఆదివాసీలు ఆహార పదార్థాలే అలవాటు చేసుకోవచ్చు..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..