Hyderabad: మార్నింగ్ వాక్ చేస్తున్న న్యాయవాదిపై కత్తితో దాడి.. కారణం అదేనా?
ఇంతలోనే హఠాత్తు పరిణామం. వారి వెంట తీసుకొచ్చిన కత్తితో చేయి మీద దాడి చేశారు. తేరుకునేలోపే న్యాయవాది చేతిలోని సెల్‌ఫోన్ లాక్కొని ద్విచక్ర వాహనంపై పారిపోయారు దుండగులు.
హైదరాబాద్ మహానగరంలో మొబైల్ చోరీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకి వందల మొబైల్‌లో చోరీకి గురవుతున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. మొబైల్ చోరీలకు పాల్పడుతున్నటువంటి ముఠాలపై ఇప్పటికే ఫోకస్ పెట్టిన పోలీసులు పెద్ద మొత్తంలో మొబైల్ ఫోన్ల రికవరీని కూడా చేస్తున్నారు. కానీ చోరీలు మాత్రం ఆగడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి బైకులపై తిరుగుతూ ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ గా చేసుకుని వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లను చోరీ చేస్తున్నారు. ఎదురు తిరిగిన వారిపై కత్తులతో దాడి చేసి బైక్లపై పరారవుతున్నారు. ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్లో పై ఫోకస్ పెట్టిన పోలీసులు కొన్ని వందల ఫోన్లను రికవరీ కూడా చేశారు అయినా ఫోన్లో చోరీ మాత్రం ఆగడం లేదు..
తాజాగా హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం(నవంబర్ 12) ఉదయం కళ్యాణ్ అనే న్యాయవాది తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేసేందుకు బయటకు వచ్చారు. ఐమాక్స్ వద్ద ఫోన్ మాట్లాడుతూ తన కుక్కని పట్టుకొని ఒంటరిగా నడుస్తూ వెళ్తున్నారు. ఇంతలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు యాక్టివా మీద రావడం జరిగింది. అనంతరం న్యాయవాదితో మాట్లాడుతున్నట్లుగా నటించారు.
ఇంతలోనే హఠాత్తు పరిణామం. వారి వెంట తీసుకొచ్చిన కత్తితో చేయి మీద దాడి చేశారు. తేరుకునేలోపే న్యాయవాది చేతిలోని సెల్‌ఫోన్ లాక్కొని ద్విచక్ర వాహనంపై పారిపోయారు దుండగులు. దీంతో న్యాయవాది చేతికి స్వల్ప గాయాలయ్యాయి. రాష్ట్ర సచివాలయానికి కూతవేటు దూరంలో జరిగిన ఋ సంఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఖైరతాబాద్ పోలీసులు న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు మొబైల్ చోరీ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ, పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దుండగులు వచ్చిన రూట్లను సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..