AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మట్టి కుండ వర్సెస్‌ గీజర్‌..! ఎలాంటి వేడినీరు శరీరానికి మేలు చేస్తుందంటే..

మట్టి పొయ్యిపై నీటిని వేడి చేయడం వల్ల మట్టి ఖనిజాలు వంటి సహజ మూలకాలు నీటిలో కనిపిస్తాయి. ఈ ఖనిజాలు నీటికి ప్రత్యేక లక్షణాలను అందిస్తాయి.. ఇది చర్మానికి ప్రయోజనకరంగా పనిచేస్తుంది. కానీ గ్యాస్, గీజర్లలో వేడిచేసిన నీటిలో సహజ మూలకాలు కనిపించవు. కాబట్టి దానిపై వేడిచేసిన వేడి నీరు ఎలాంటి మేలు చేయదు.

మట్టి కుండ వర్సెస్‌ గీజర్‌..! ఎలాంటి వేడినీరు శరీరానికి మేలు చేస్తుందంటే..
Earthen Stove Vs Geyser
Jyothi Gadda
|

Updated on: Nov 12, 2024 | 1:15 PM

Share

చలికాలం మొదలైంది.. వేడి నీటి వినియోగం కూడా పెరిగింది. గతంలో దాదాపు అందరూ కట్టెలు, బొగ్గుల పొయ్యి మీద వేడిచేసిన నీటిని స్నానాలు ఇతర పనులకు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు గ్యాస్, గీజర్ అందుబాటులోకి రావడంతో పొయ్యి వినియోగం మూలనడింది. అయితే స్టవ్‌పై వేడిచేసిన నీరు శరీరానికి మంచిదా..? లేదా గ్యాస్‌పై వేడి చేసిన నీరు మంచిదా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా..? అందుకే ఇప్పుడు మనం స్టవ్ హీటెడ్ వాటర్, గ్యాస్ గీజర్ హీటెడ్ వాటర్ మధ్య తేడాను తెలుసుకుందాం..ఇది మన ఆరోగ్యం, చర్మంపై కూడా ఎలాంటి ప్రభావం చూపుతుంది.? రెంటికి తేడా ఏంటంటే..

మట్టి పొయ్యిపై నీటిని ఒక ఏకరీతి ఉష్ణోగ్రతను నిర్వహించడానికి నెమ్మదిగా వేడి చేస్తారు. ఈ ప్రక్రియలో నీటి ఉష్ణోగ్రత పెద్దగా పెరగదు. దీని కారణంగా ఇది చర్మాని, ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. గ్యాస్‌ లేదా గీజర్‌లోని నీరు వేగంగా వేడెక్కుతుంది. దీని ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. నియంత్రించడం కష్టం. దీనివల్ల చర్మం సడెన్‌ వేడి నీళ్ల ప్రభావాన్ని భరించాల్సి ఉంటుంది.

మట్టి పొయ్యిపై నీటిని వేడి చేయడం వల్ల మట్టి ఖనిజాలు వంటి సహజ మూలకాలు నీటిలో కనిపిస్తాయి. ఈ ఖనిజాలు నీటికి ప్రత్యేక లక్షణాలను అందిస్తాయి.. ఇది చర్మానికి ప్రయోజనకరంగా పనిచేస్తుంది. కానీ గ్యాస్, గీజర్లలో వేడిచేసిన నీటిలో సహజ మూలకాలు కనిపించవు. కాబట్టి దానిపై వేడిచేసిన వేడి నీరు ఎలాంటి మేలు చేయదు.

ఇవి కూడా చదవండి

శక్తి వనరులు, పర్యావరణంపై కూడా ప్రభావం ఉంటుంది. సాంప్రదాయ పద్ధతిలో కలప లేదా పేడను కాల్చడం ద్వారా నీటిని వేడి చేస్తారు. ఇది వాతావరణంలో పొగను ఎక్కువగా విడుదల ఏస్తుంది. ఇది పూర్తిగా సహజమైన ప్రక్రియ, సంప్రదాయ ఇంధన వనరులను ఉపయోగిస్తుంది. అదే గ్యాస్ గీజర్‌లో నీటిని వేడి చేయటం కోసం వాయువును ఉపయోగిస్తుంది. ఇది తక్కువ సమయంలో నీటిని వేడి చేస్తుంది. కానీ ఇది శక్తి వనరులను వినియోగిస్తుంది. పర్యావరణంపై ప్రభావం చూపుతుంది.

మట్టి పొయ్యిపై తక్కువ వేడి మీద నీటిని వేడి చేయడం వల్ల నీటి pH స్థాయిని స్థిరీకరిస్తుంది. ఇది చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. గీజర్‌లోని నీరు వేగంగా వేడెక్కడం వల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ నీరు చర్మాన్ని కాస్త పొడిబారేలా చేస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు.. మట్టి పొయ్యిలో వేడిచేసిన నీటిలో స్నానం చేయడం వల్ల శరీర అలసట తగ్గుతుంది. ఇది చర్మంలో తేమను నిలుపుతుందని కూడా నమ్ముతారు. కానీ గ్యాస్ లేదా గీజర్ మీద వేడిచేసిన నీటిని వాడితే, నీరు వేడిగా మారుతుంది. దీంతో చర్మం పొడిబారుతుంది.మట్టి పొయ్యిపై వేడిచేసిన నీరు చర్మం, ఆరోగ్య ప్రయోజనాల పరంగా మరింత ప్రయోజనకరం. కానీ సౌలభ్యం, సమయం ఆదా పరంగా, గ్యాస్ గీజర్ మంచి ఎంపిక అని చెప్పక తప్పదు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..