IND vs SA: అదరగొట్టిన మన తెలుగు తేజం..వర్త్ వర్మా వర్త్..

సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 20 ఓవర్లలో 219/6 స్కోర్ చేసింది. యంగ్ ప్లేయర్లు తిలక్ వర్మ(107), అభిషేక్ శర్మ(50) పరుగులతో అదరగొట్టారు.

IND vs SA: అదరగొట్టిన మన తెలుగు తేజం..వర్త్ వర్మా వర్త్..
Team India First Innings Score In Ind Vs Sa Third Test Match
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 14, 2024 | 2:22 AM

సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ ఓడి బ్యాటింగ్ కి దిగింది. టీమిండియా 20 ఓవర్లలో 219/6 స్కోర్ చేసింది. యంగ్ ప్లేయర్లు తిలక్ వర్మ(107), అభిషేక్ శర్మ(50) పరుగులతో అదరగొట్టారు. సౌతాఫ్రికా బౌలర్లు సిమెతనే 2, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు తీశారు. అలాగే జాన్‌సెన్ ఒక్క వికెట్ తీశాడు. తిలక్ వర్మ ఈ మ్యాచ్ సెంచరీ చేసి విధ్వంసం స్పష్టించాడు. కేవలం 51 బంతులోనే సెంచరీ చేయడం విశేషం. 6 సిక్సర్లు, 8 ఫోర్లుతో విరుచుపడ్డాడు. ఇంకా అభిషేక్ శర్మ 25 బాల్స్‌లోనే హఫ్ సెంచరీ చేశాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు శుభారంభం లభించలేదు. సంజూ శాంసన్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. దీని తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధించాడు. అభిషేక్‌తో కలిసి రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించాడు. అలాగే తన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేశాడు. తన సెంచరీ ఇన్నింగ్స్‌లో 51 బంతులు ఎదుర్కొన్న తిలక్ 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 196.07 స్ట్రైక్ రేట్‌తో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన 11వ భారత ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు. దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించిన 5వ భారత ఆటగాడిగా కూడా తిలక్ నిలిచాడు. తిలక్ కంటే ముందు సురేశ్ రైనా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై సెంచరీలు ఆడారు. కేవలం 21 ఏళ్ల 279 రోజుల్లోనే తొలి టీ20 సెంచరీ సాధించిన యస్సవ్ జైస్వాల్ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తిలక్ వర్మ సెంచరీ ఇన్నింగ్స్ కారణంగానే భారత జట్టు తమ ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. పైన చెప్పినట్టుగానే భారత జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ అదరగొట్టాడు. చివరకు 20 ఓవర్లలో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో, తిలక్‌తో పాటు, అభిషేక్ శర్మ కూడా 25 బంతుల్లో 50 పరుగులు, హార్దిక్ పాండ్యా 18 పరుగులు మరియు రమణదీప్ సింగ్ 15 పరుగులు అందించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి