Money Astrology: చంద్ర – రాహువుల కలయిక.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం!
డిసెంబర్ 24-26 తేదీలలో కుంభ రాశిలో చంద్ర, రాహువుల కలయిక అద్భుతమైన మార్పులను తీసుకురానుంది. గురువు దృష్టితో ఈ కలయిక మేషం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులవారికి ఊహించని ధన లాభం, రాజయోగాలు ప్రసాదిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు, ఆర్థిక సమస్యల పరిష్కారం, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి ఇది సువర్ణావకాశం.

Money Astrology
జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్ర, రాహువులు ఏ రాశిలోనైనా కలిస్తే కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. హఠాత్ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఈ నెల (డిసెంబర్) 24, 25, 26 తేదీల్లో కుంభ రాశిలో కలుస్తున్న చంద్ర, రాహువుల వల్ల జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు, ఆకస్మిక పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఈ చంద్ర, రాహువులను గురువు వీక్షించడం వల్ల మరింతగా శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. మేషం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులవారికి ఆకస్మిక ధన లాభంతో పాటు, ఊహించని ధన యోగాలు, రాజయోగాలు కలిగే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి లాభ స్థానంలో చంద్ర, రాహువులు కలవడం, వాటిని గురువు వీక్షించడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతి కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు జోరందుకుంటాయి. రాదనుకున్న డబ్బు, రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందుతాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి.
- మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్ర, రాహువులు కలవడం వల్ల గతంలో ప్రయత్నించి వదిలేసినవన్నీ ఇప్పుడు నెరవేరుతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగం మారడానికి చేసిన ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, మరచిపోయిన డబ్బు అప్రయత్నంగా చేతికి అందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.
- కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న చంద్ర, రాహువుల వల్ల అనుకోకుండా ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు చాలావరకు సమసిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. అనారోగ్యాలకు సరైన వైద్య చికిత్స లభిస్తుంది. కోర్టు కేసుల నుంచి పూర్తిగా బయటపడతారు. ఉద్యోగంలో పదోన్నతులకు మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లోనూ, పెళ్లి ప్రయత్నాల్లోనూ శుభవార్తలు వింటారు.
- తుల: ఈ రాశికి పంచమ స్థానంలో చంద్ర, రాహువుల యుతి వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా ఘన విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు, సంస్థ లాభపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం సంపాదిస్తారు.
- మకరం: ఈ రాశికి ధన స్థానంలో చంద్ర, రాహువులు కలవడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు మెరుగైన ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగు పడుతుంది. ఇతరులకు బాగా సహాయం చేస్తారు. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. రావలసిన డబ్బు, రాదనుకున్న డబ్బు చేతికి అందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
- కుంభం: ఈ రాశిలో చంద్ర, రాహువులు కలవడం వల్ల శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో సీనియర్ల కాదని పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద విజయం సాధిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల మీద అనుకూలంగా తీర్పులు వెలువడతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.