Eggs for Breakfast: ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌కి గుడ్డు తింటే ఏమవుతుంది?
గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజూ మీ అల్పాహారంలో గుడ్లను చేర్చుకుంటే ఇంకా మంచిది. గుడ్లు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. గుడ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. గుడ్లలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి..
Updated on: Oct 02, 2025 | 8:40 PM

గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజూ మీ అల్పాహారంలో గుడ్లను చేర్చుకుంటే ఇంకా మంచిది. గుడ్లు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. గుడ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.

ఈ రెండింటిలో ఉడికించిన గుడ్లు బరువు తగ్గడానికి మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. అవి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతేకాకుండా వాటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

అంతేకాకుండా గుడ్లలో కోలిన్ అనే పోషకం కూడా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది గుండె సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

ఉడికించిన గుడ్ల కంటే గుడ్డు ఆమ్లెట్లలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఎందుకంటే ఆమ్లెట్లకు అదనంగా మరికొన్ని పదార్ధాలను కలుపుతాం. ఎక్కువ నూనెను కూడా ఉపయోగిస్తాం. ఇది బరువు పెరిగే అవకాశాలను పెంచుతుంది.

గుడ్లు బరువు తగ్గడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు గుడ్లు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు.




