- Telugu News Photo Gallery Cinema photos Tollywood makers left all the festivals to other language films
Festival Movies: పండగల వేళ పొరుగు సినిమాల సందడి.. టాలీవుడ్ సంగతేంటి.?
మన దగ్గర సెట్స్ మీదున్న సినిమాలేంటి? ప్యాన్ ఇండియా రేంజ్‌లో రెడీ అవుతున్న ప్రాజెక్టులేంటి? పొరుగు హీరోల ప్లానింగ్ ఎలా ఉంది?... క్యాలండర్ ఇయర్ స్టార్ట్ అయ్యీ కాగానే మేకర్స్ జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఇవి... మరీ ముఖ్యంగా సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళి, క్రిస్‌మస్.. ఈ సీజన్ల మీద గట్టి ఫోకస్ పెట్టాలి. మరి మన వారు ఆ పని చేస్తున్నారా? లేదా?
Updated on: Jul 22, 2024 | 5:46 PM

ప్రాజెక్ట్ మీద నమ్మకం, ఎప్పుడు రిలీజ్ చేయాలనే ప్లానింగ్ ఉంటే నమ్మిన సీజన్‌కి ఫిక్స్ అయి విజయఢంకా మోగించవచ్చని రీసెంట్‌గా ప్రూవ్ చేసింది హనుమాన్. ఈ సంక్రాంతిని క్యాష్ చేసుకున్న ఏకైక సినిమాగా హనుమాన్ కి పేరు దక్కింది. ఎన్నికల కారణంగా ఈ సమ్మర్ మొత్తం గాయబ్ అయింది. కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసుకోవడానికి వీలున్న సీజన్ సమ్మర్. పక్కా కమర్షియల్ కంటెంట్‌తో బాక్సాఫీస్ దుమ్ముదులిపేసే సీజన్ మిస్ అయిపోయింది.

సమ్మర్‌లో రావాల్సిన సినిమాలు పోస్ట్ సమ్మర్ వచ్చి ఎలాగోలా నిలదొక్కుకోగలిగాయి. సమ్మర్ తర్వాత టాలీవుడ్ సినిమాలకు పర్ఫెక్ట్ సీజన్ దసరా. తెలుగువాళ్లకి పండగంటే ఇంట్లో ఆచారాలతో పాటు, థియేటర్లలో సినిమాలు కూడా. జూన్ 27న వచ్చిన కల్కి ఈరోజు 1000 కోట్లు వసూళ్లు చేసిన తొలి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

దసరా మీద కూడా ఈ సారి మన ఫోకస్ పెద్దగా లేదు. అక్టోబర్ 10న వస్తానన్న దేవర, కాస్త ముందుగానే వచ్చేస్తుంది. ఆ రోజుకు వస్తుందని ఆశించిన గేమ్ చేంజర్ కూడా రావడం లేదు. అందుకే, ఇంతకన్నా పర్ఫెక్ట్ డేట్ దొరకదంటూ కంగువ కబ్జా చేసేసింది.

కమర్షియల్ సినిమాలకు లడ్డూలాంటి సీజన్‌ని, పొరుగు హీరోలకు అలా ఎలా వదిలేశారని ఫీలవుతున్నాయి ట్రేడ్ వర్గాలు. పోనీ, దీపావళికి విడుదలయ్యే సినిమాలున్నాయా? అంటే అక్కడా ఖాళీ కనిపిస్తోంది. దసరాకు రావాల్సిన వేట్టయాన్ దీపావళి బరిలో కనిపిస్తోంది. అంటే ఈ సీజన్ కూడా మనకు లేదన్నమాటే.

మంచి మంచి సీజన్ల మీద నీళ్లు చల్లిన టాలీవుడ్ డిసెంబర్ మీద ఎక్కువ భారం మోపుతోంది. క్రిస్మస్ మంత్ మాత్రం తెలుగు రిలీజు డేట్లతో కళకళలాడుతోంది. అయితే పుష్ప 2 రిలీజ్ ఉంటే ఈ లెక్క ఒకలా ఉంటుంది... ఒకవేళ బరిలో లేకుంటే రంగులు ఇంకోలా మారుతాయి. విషయం ఏదైనా ఈ ఏడాది డిసెంబర్ తప్ప మిగిలిన సీజన్లను పొరుగు స్టార్లకు రాసివ్వడం మాత్రం ఏం బాలేదని అంటున్నారు విమర్శకులు. ఇకపై అయినా పక్కా ప్లానింగ్‌తో మనవారు ముందుకు సాగాలని కోరుకుంటున్నారు.




