- Telugu News Photo Gallery Cinema photos Actress Sakshi Agarwal celebrates her birthday at old age home, Shares photos
Sakshi Agarwal: వృద్ధాశ్రమంలో బర్త్ డే చేసుకున్న హీరోయిన్.. అవ్వా తాతలకు కడుపు నిండుగా భోజనం పెట్టి.. ఫొటోస్
గతంలో కంటే పుట్టిన రోజు వేడుకలు ఇప్పుడు చాలా కాస్ట్ లీ అయిపోయాయి. కలర్ ఫుల్ డ్రెస్సులు, భారీ కేక్ కటింగ్ లు.. విందులు, వినోదాలు, వీలైతే పబ్బు, పార్టీలు.. ఇలా బర్త్ డే వేడుల్లో భాగమైపోయాయి. ఇక సినిమా సెలబ్రిటీల పుట్టిన రోజులు అంటే 'అంతకు మించి' ఉండాల్సిందే.
Updated on: Jul 22, 2024 | 4:16 PM

గతంలో కంటే ఇప్పుడు పుట్టిన రోజు వేడుకలు చాలా కాస్ట్ లీ అయిపోయాయి. కలర్ ఫుల్ డ్రెస్సులు, భారీ కేక్ కటింగ్ లు.. విందులు, వినోదాలు, వీలైతే పబ్బు, పార్టీలు.. ఇలా బర్త్ డే వేడుల్లో భాగమైపోయాయి. ఇక సినిమా సెలబ్రిటీల పుట్టిన రోజులు అంటే 'అంతకు మించి' ఉండాల్సిందే.

సాధారణంగా సినిమా తారలు ప్రైవేట్ హోటల్స్, రిసార్ట్స్, క్లబ్బులు, పబ్బుల్లో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా ప్రముఖ తమిళ హీరోయిన్ సాక్షి అగర్వాల్ వృద్ధా శ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది.

హీరోయిన్ అన్న భేషజాలకు పోకుండా, వృద్ధాశ్రమంలోని అవ్వ, తాతలతో ముచ్చట్లూ చెబుతూ సరదాగా కాలక్షేపం చేసింది సాక్షి . వారికి కడుపు నిండా భోజనం పెట్టింది.

అలాగే ఆటలు, పాటలు, మాటలతో వారిని కాసేపు నవ్వించిందీ అందాల తార . అనంతరం ఆ అవ్వాతాల ఆశీర్వాదం తీసుకుంది.

వృద్ధాశ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది సాక్షి అగర్వాల్.వీటిని చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

కాగా నేరుగా తెలుగు సినిమాల్లో నటించలేదు సాక్షి అగర్వాల్. అయితే కొన్ని డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార.




