- Telugu News Photo Gallery Cinema photos Polimera Movie Fame Kamakshi Bhaskarla Childhood Photos Goes viral
Tollywood: తస్సాదియ్యా.. లక్కంటే ఈ హీరోయిన్దే మావా.. ఒకేసారి మూడు సినిమాలు.. నెట్టింట అందాల జోరు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తెలుగమ్మాయిలు సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్లుగా వరుస సినిమాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోన్న ముద్దుగమ్మలలో ఈ హీరోయిన్ ఒకరు. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈఅమ్మడు. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలతో బిజీగా ఉంది.
Updated on: Mar 27, 2025 | 8:53 PM

ప్రస్తుతం తెలుగు సినీరంగంలో సత్తా చాటుతున్న తెలుగమ్మాయిలలో కామాక్షి భాస్కర్ల ఒకరు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. విభిన్నమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తుంది.

తెలుగులో ఇప్పుడిప్పుడే చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతుంది కామాక్షి భాస్కర్ల. ఇప్పుడు ఈ అమ్మడు మూడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ చిత్రంలో నటిస్తుంది.

అలాగే నవీన్ చంద్ర హీరోగా చేస్తోన్న లైట్ హార్టెడ్ చిత్రంలోనూ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగా.. త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు పోలిమేరా మూడో భాగంలోనూ కనిపించనుంది.

ఒకేసారి మూడు విభిన్నమైన సినిమాల్లో నటించడమే కాకుండా మూవీ వైవిధ్యమైన పాత్రలతో అడియన్స్ ముందుకు రావడం తనకు చాలా గర్వంగా ఉందని తెలిపింది. కామాక్షి చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కొన్నాళ్లు వైద్యురాలిగా పనిచేసింది.

ఆ తర్వాత హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలు అందించింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి చిన్న చిన్న చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. పోలిమేరా సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.




