- Telugu News Photo Gallery Cinema photos Chiranjeevi allu arjun prabhas upcoming movies shooting starts soon
రాబోయే 30 రోజుల్లో 3 పెద్ద సినిమాల అనౌన్స్‌మెంట్స్..
టాలీవుడ్‌లో ఇప్పటికే పెద్ద సినిమాలపై అనౌన్స్‌మెంట్స్ చాలా వచ్చాయి. కానీ వాటి ఓపెనింగ్స్ మాత్రం బాకీ ఉన్నాయి. ఇప్పుడా ముచ్చట తీరబోతుంది. రాబోయే 30 రోజుల్లో 3 పెద్ద సినిమాల ముహూర్తాలు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అందులో ఒకటి ఉగాదికి.. మరో రెండు ఏప్రిల్‌లో ఉండబోతున్నాయి. మరి ఏంటా సినిమాలు..? అందులో హీరోలెవరు..?
Updated on: Mar 27, 2025 | 8:55 PM

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల హిట్ కొట్టారు అనిల్ రావిపూడి. ఈ సినిమా ఇచ్చిన జోష్‌లో చిరంజీవి కోసం కథ సిద్ధం చేస్తున్నారు ఈ దర్శకుడు.

మెగాస్టార్ సినిమాను ఉగాది నాడు పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టనున్నారు అనిల్ రావిపూడి. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఉగాది రోజు ముహూర్తం పెట్టి మే తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు అనిల్.

ఇక అల్లు అర్జున్, అట్లీ సినిమా ఓపెనింగ్‌పై ఒక క్లారిటీ వచ్చింది. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా అట్లీ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తుంది.

అట్లీ, అల్లు అర్జున్ సినిమా బడ్జెట్ 500 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తుంది. ప్రస్తుతం దుబాయ్‌లో స్టోరీ సిట్టింగ్స్ బిజీ బిజీగా జరుగుతున్నాయి. మే నుంచి బన్నీ, అట్లీ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశం ఉంది.

ప్రభాస్ అభిమానులు ఎప్పట్నుంచో వేచి చూస్తున్న స్పిరిట్ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఏప్రిల్‌లోనే జరగనున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నారు సందీప్ రెడ్డి వంగా. ఆర్నెళ్లలోనే స్పిరిట్ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు సందీప్. మొత్తానికి రాబోయే నెల రోజుల్లో 3 భారీ సినిమాల ఓపెనింగ్స్ జరగబోతున్నాయి.




