ప్రకృతి ఒడిలో అందంగా, ఆనందంగా.. సమంత క్యూట్ ఫొటోస్ చూశారా!
జెస్సీగా కుర్రకారు మనసు దోచుకున్న చిన్నది సమంత. ఏమాయ చేశావే అంటూ యూత్ క్రష్ అయిపోయింది. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుని, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. ఇక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే పెళ్లి, తర్వాత విడాకులు, అనారోగ్యసమస్యలు ఇలా ఊహించని విధంగా సమంత లైఫ్ టర్న్ అయ్యిందనే చెప్పాలి. మయోసైటీస్ తర్వాత సామ్ చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేసిన ఈ బ్యూటీ, తాజాగా ప్రకృతిలో ఆనందంగా గడిపింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Mar 28, 2025 | 12:35 PM

అందాల చిన్నది సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.ఒకప్పుడు టాలీవుడ్‌నే షేక్ చేసిన ఈ నటి ప్రస్తుతం తెలుగులో అంతగా సినిమాలు చేయడం లేదు. బాలీవుడ్, హాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌లతో బిజీ అయిపోయింది.

ఇక మయోసైటీస్ వ్యాధి బారినపడిన తర్వాత సమంత చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరస వెబ్ సిరీస్‌లతో దూసుకెళ్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది సమంత.

ఎప్పటికప్పుడు తన విషయాలను అభిమానులతో పంచుకుంటూ వారితో చిట్ చాట్ చేస్తుంది. అంతే కాకుండా తన వరస ఫొటో షూట్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ఇక తాజాగా సమంత తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫొటోస్ చూసి ఈ బ్యూటీ అభిమానులు చాలా సంతోషపడుతున్నారు.

ఎందుకంటే ఈ మధ్య సమంత ఎప్పుడూ డల్‌గా, సీరియస్ లుక్‌లో ఉన్న ఫొటోస్ మాత్రమే షేర్ చేస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రకృతిలో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు అభిమానులతో పంచుకుంది. ఇందులో సమంత చాలా సంతోషంగా ఉండటంతో, చాలా రోజుల తర్వాత సామ్ ఫుల్ హ్యాప్పీగా ఉందంటూ తన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సమంత తన సొంత బ్యానర్ పై మా ఇంటి బంగారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో మరోసారి తెలుగు అభిమానుల ముందుకు రానుంది ఈ చిన్నది.



