- Telugu News Photo Gallery Cinema photos Param Sundari Trailer Janhvi Kapoor's South Star Dialogue Goes Viral
Param Sundari: పరమ్ సుందరి లో సౌత్ సినిమాల గురించి స్టన్నింగ్ డైలాగ్స్.. సోషల్ మీడియా లో రచ్చ రచ్చ
జాన్వీ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ పరమ్ సుందరి. ఆగస్టు 29న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ ట్రైలర్‌లో సౌత్ సినిమా గురించి చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్ నార్త్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా పరమ్ సుందరి.
Updated on: Aug 14, 2025 | 1:30 PM

సౌత్ నార్త్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా పరమ్ సుందరి. జాన్వీ కపూర్ సౌత్ అమ్మాయిగా, సిద్దార్థ్ మల్హోత్రా నార్త్ అబ్బాయిగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ప్రమోషన్ స్పీడు పెంచిన మేకర్స్ వరుస అప్‌డేట్స్‌తో హైప్ పెంచుతున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన పరమ్ సుందరి సాంగ్స్ టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ రిలీజ్ అయిన రొమాంటిక్ మెలోడి గ్లోబల్ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

ఆ తరువాత రిలీజ్ అయిన రెయిన్ సాంగ్‌కు కూడా అదే రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ సౌత్ సర్కిల్స్‌లోనూ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేశారు.

ముఖ్యంగా ట్రైలర్ లాస్ట్‌లో జాన్వీ చెప్పిన సౌత్ స్టార్స్ డైలాగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో ఈ డైలాగ్‌కు విజిల్స్ పడటం ఖాయం అంటున్నారు సౌత్ ఆడియన్స్,.

సౌత్‌లో ఒక్కో స్టేట్‌కు ఒక్కో సూపర్ స్టార్ ఉన్నారంటూ... రజనీకాంత్, మోహన్‌లాల్, అల్లు అర్జున్, యష్ పేరు చెప్పుతూ బాలీవుడ్ మీద సెటైర్స్ వేస్తుంది జాన్వీ. నార్త్ మేకర్స్ తీసిన హిందీ సినిమాలో సౌత్ గురించి ఇలాంటి డైలాగ్ ఉండటం మీద నేషనల్ లెవల్‌లో డిస్కషన్ జరుగుతోంది.




