- Telugu News Photo Gallery Cinema photos Actress Lakshmi Manchu on 50 years of Super Star Rajinikanth
మా నాన్న కోసమే రజినీకాంత్ ఆ సినిమా చేశారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మంచు లక్ష్మీ
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన కూలీ సినిమా లో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ తదితరులు నటించారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీకి వచ్చి 50ఏళ్లు పూర్తయ్యింది.
Updated on: Aug 14, 2025 | 1:36 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన కూలీ సినిమా లో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ తదితరులు నటించారు.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీకి వచ్చి 50ఏళ్లు పూర్తయ్యింది. సూపర్ స్టార్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే నటి, నిర్మాత మంచు లక్ష్మీ సూపర్ స్టార్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది.

తన తండ్రి మోహన్ బాబు కోసం రజినీకాంత్ ఓ సినిమాలో నటించారని ఆమె అన్నారు. నాన్న, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్.. చిన్నతనంలో మా పుట్టిన రోజుకు ఆయన వచ్చే వారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తో మేము పెద్దయ్యాక అర్ధమైంది. ఇప్పటికీ నాన్న, రజనీకాంత్ కలిసినప్పుడు చిన్నపిల్లలా మారిపోతారు.

వారి స్నేహానికి 50ఏళ్లు..వారి స్నేహం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నా.. నాన్న కష్టాల్లో ఉన్నప్పుడు రజినీకాంత్ ఎంతో సాయం చేశారు. మాములుగా ఆయన చిన్న చిన్న పాత్రలు చేయరు.. కానీ నాన్న కోసం' పెదరాయుడు’లో అతిథి పాత్రలో నటించారు.

రాయలసీమ రామన్న చౌదరి సినిమా కథను కూడా రజినీకాంత్ అందించారు.. ఆయన ఎంతో మంచి వ్యక్తి.. నటుడిగానే కాదు వ్యక్తగాను ఆయన ఎంతో మంచి ఆదర్శం.. చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన నటించిన కూలీ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా.. అంటూ చెప్పుకొచ్చారు మంచు లక్ష్మీ.




