- Telugu News Photo Gallery Cinema photos Kajal Aggarwal as special attraction at Sikander movie trailer launch event
తల్లైనా తగ్గని అందం.. కాజల్ ను చూస్తే మతిపోవాల్సిందే!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. లక్ష్మీ కళ్యాణం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగ్మకు వరసా ఆఫర్స్ క్యూ కట్టాయి. స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకొని, తన గ్లామర్ తో టాలీవుడ్ నే షేక్ చేసింది. ఇక ఇప్పటికీ కాజల్ అదే గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లైనా గ్లామర్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు కాజల్.
Updated on: Mar 27, 2025 | 10:23 AM

అందాల ముద్దుగుమ్మ కాజల్ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్, నటనతో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో మంచి ఫేమ్ సంపాదించుకుంది. పెళ్లై ఓ బాబుకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ సినిమాలకు కాస్త దూరమైంది.

ఇక ఈ మధ్యనే ఈ బ్యూటీ సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గతంలో కంటే కాజల్ కు ఇప్పుడు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ అమ్మడుకు ఆఫర్స్ కరువు అయ్యాయి. దీంతో వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది కాజల్ అగర్వాల్.

తెలుగులో మంచు విష్ణు కన్నప్ప సినిమాలో పార్వతి పాత్రలో కనిపించనుంది కాజల్. ఇవే కాకుండా పలు సినిమాల్లో కూడా ఈ నటి కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన అందాలతో కుర్రకారు మతిపొగొట్టింది. ఈ నటి సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ క్రమంలోనే ఈఅమ్మడు, సికిందర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు అటెండ్ అయ్యింది. అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఈ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్ క్లీవేజ్ అందాలతో కనిపించి యూత్ కు చెమటలు పట్టించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఓ బిడ్డకు జన్మనిచ్చినా కాజల్ అందం ఏమాత్రం తగ్గలేదంటున్నారు అభిమానులు.



