- Telugu News Photo Gallery Cinema photos Heroine Mrunal Thakur gave clarity on marriage Telugu Actress Photos
Mrunal Thakur: ప్రొఫెషనల్ ఓకే పర్సనల్ లైఫ్ కూడా కాస్త చూడు సీత.! పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మృణాల్
నమ్మక తప్పని నిజాలు అని కొన్ని ఉంటాయి కదా.. ఇప్పుడు మృణాల్ పెళ్లి వార్త కూడా అలాంటిదే. ఫామ్ లో ఉన్న హీరోయిన్‌కీ పెళ్లి అనే మాటకీ అసలు సూటవదు అనేది నిన్నటి మాట. ఫామ్‌లో ఉంటే ఏంటి.? పెళ్లి చేసుకుంటే ఏంటి.? అవి రెండూ.. రెండు వేర్వేరు ఛానల్స్.. కలిపి చూడకండి అన్నది ఇప్పుడు హీరోయిన్లు నమ్ముతున్న మాట. అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి కదా అని వచ్చిన ప్రతి ఛాన్స్ నీ యుటిలైజ్ చేసుకోవాలని అనుకోవట్లేదు మృణాల్.
Updated on: Dec 10, 2023 | 7:37 PM

నమ్మక తప్పని నిజాలు అని కొన్ని ఉంటాయి కదా.. ఇప్పుడు మృణాల్ పెళ్లి వార్త కూడా అలాంటిదే. ఫామ్ లో ఉన్న హీరోయిన్‌కీ పెళ్లి అనే మాటకీ అసలు సూటవదు అనేది నిన్నటి మాట.

ఫామ్‌లో ఉంటే ఏంటి.? పెళ్లి చేసుకుంటే ఏంటి.? అవి రెండూ.. రెండు వేర్వేరు ఛానల్స్.. కలిపి చూడకండి అన్నది ఇప్పుడు హీరోయిన్లు నమ్ముతున్న మాట.

అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి కదా అని వచ్చిన ప్రతి ఛాన్స్ నీ యుటిలైజ్ చేసుకోవాలని అనుకోవట్లేదు మృణాల్. ఆచి తూచి స్టెప్పులు వేస్తున్నారు. అందులోనూ సౌత్‌లో తనకున్న ఇమేజ్‌కి సరిపోయే కేరక్టర్లనే సెలక్ట్ చేసుకుంటున్నారు.

హాయ్ నాన్నలో ఆమె కేరక్టర్‌ని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఇది. సీతారామమ్ సినిమాలో సీత కేరక్టర్‌లో మృణాల్‌ని చూసిన వారు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారని మెచ్చుకున్నారు.

రామ్ కోసం సీత వెతుకుతుంటే, వెంటనే వెళ్లి సాయం చేసేయాలన్నంత ఫీల్ అయిపోయారు. అంతగా జనాల్లోకి వెళ్లింది సీత కేరక్టర్. ఇప్పుడు మృణాల్ ఫ్యామిలీస్టార్లో చేస్తున్న కేరక్టర్ కూడా అచ్చం అలాంటిదే.

తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనే హింట్ అందుతోంది. ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ పెళ్లి గురించి రీసెంట్‌గా స్పందించారు.

తనకు ఇంకా పెళ్లి కాలేదని, అతి త్వరలోనే చేసుకుంటానని ఫారిన్‌లో పబ్లిక్‌గా చెప్పేశారు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ సీతమ్మ సినిమాలను, పర్సనల్ లైఫ్‌ని భలేగా ప్లాన్ చేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది ఇండస్ట్రీలో.




