- Telugu News Photo Gallery Cinema photos Focus on Pawan Kalyan Surender Reddy combo movie Updates Telugu Entertainment Photos
Pawan Kalyan: ప్రెజెంట్ సినిమాలకు దూరంగా ఉన్న ఇండస్ట్రీలో పవన్ పేరు ఎప్పటికి ట్రేండింగ్.
పవన్ కల్యాణ్ సినిమాలేవీ ఇప్పుడు రిలీజులకు రెడీగా లేవు. ఆయన షూటింగులకు హాజరుకావడం లేదు. సినిమా పబ్లిసిటీలకూ దూరంగానే ఉన్నారు. అయినా పవర్‌స్టార్ పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఆయన సినిమాలకు పనిచేస్తున్న టెక్నీషియన్లు ఏదో ఒక సందర్భంగా పవన్ కల్యాణ్ పేరు వాడుతుండటంతో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు పవర్‌స్టార్. తమిళ సినిమా వినోదయ సిత్తమ్ రీమేక్‌గా రిలీజ్ అయింది బ్రో మూవీ.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Dec 10, 2023 | 7:36 PM

పవన్ కల్యాణ్ సినిమాలేవీ ఇప్పుడు రిలీజులకు రెడీగా లేవు. ఆయన షూటింగులకు హాజరుకావడం లేదు. సినిమా పబ్లిసిటీలకూ దూరంగానే ఉన్నారు. అయినా పవర్‌స్టార్ పేరు ట్రెండింగ్‌లో ఉంది.

ఆయన సినిమాలకు పనిచేస్తున్న టెక్నీషియన్లు ఏదో ఒక సందర్భంగా పవన్ కల్యాణ్ పేరు వాడుతుండటంతో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు పవర్‌స్టార్. తమిళ సినిమా వినోదయ సిత్తమ్ రీమేక్‌గా రిలీజ్ అయింది బ్రో మూవీ.

ఆ తర్వాత పవన్ సినిమాల ఊసే లేదు. లిస్టులో లాస్ట్ లో ఉన్న ఓజీ మాత్రం ఠపీమని ముందు వరసలో కనిపించింది. ఇంత స్పీడ్‌గా షూటింగ్ అయిపోతే ఓజీ రిలీజ్ నియర్ ఫ్యూచర్‌లోనే ఎక్స్ పెక్ట్ చేయొచ్చని అనుకున్నారు.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో, గ్యాంగ్‌స్టర్ కథగా తెరకెక్కుతోంది ఓజీ కంప్లీట్‌గా వెరైటీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది హరిహరవీరమల్లు. రీసెంట్‌గా యానిమల్‌లో విలన్‌గా మెప్పించిన బాబీ డియోల్... హరిహరవీరమల్లులోనూ విలన్.

యానిమల్ ప్రమోషన్లలో భాగంగా బాబీ చెప్పిన డైలాగులు, చేసిన లీక్స్ తో ఈ మధ్య బాగా వైరల్ అయింది హరిహరవీరమల్లు. హిస్టారికల్ ఫిక్షనల్ మూవీగా పాపులర్ అయింది. ఈ సినిమా గబ్బర్‌సింగ్ సూపర్‌డూపర్ హిట్ కాంబోలో తెరకెక్కుతోంది ఉస్తాద్ భగత్‌సింగ్. ఫక్తు కమర్షియల్ సినిమాగా ఉస్తాద్ రెడీ అవుతోంది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఎలక్షన్ హడావిడిలో ఉన్నారు. అది కాస్తా పూర్తికాగానే ముందు హరీష్ శంకర్ సినిమాకే కాల్షీట్ ఇస్తారనే మాట కూడా వినిపిస్తోంది. ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాల్లో దేని జోనర్ దానిదే. పవన్ ఆ మధ్య ఓకే చెప్పిన సురేందర్ రెడ్డి సినిమా జోనర్ కూడా ప్రత్యేకమైందే. సోషల్ సెటైర్ నేపథ్యంలో తెరకెక్కనుందట ఆ మూవీ.

పవన్ కల్యాణ్ కథ వినగానే ఎగ్జయిట్ అయ్యారని, త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ఇంట్రస్ట్ చూపించారని హింట్ ఇచ్చారు రైటర్ వక్కంతం వంశీ. నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ ప్రమోషన్లలో పవన్ విషయాన్ని లీక్ చేశారు వంశీ.





























