- Telugu News Photo Gallery Cinema photos Fahadh Faasil's Post Pushpa 2 Regret Actor Hints at Unsatisfaction
Fahad Faasil: ఫహాద్ ఫాజిల్ కంప్లయింట్ పుష్పరాజ్ మీదేనా.. అసలు ఏం జరిగిందంటే ?
పుష్ప 2 రిలీజ్ అయిన చాలా కాలం అవుతున్నా ఇంకా ఏదో ఒక రీజన్‌తో ఆ సినిమా వార్తల్లో వినిపిస్తూనే ఉంది. అయితే ఇన్నాళ్లు పాజిటివ్ వార్తలతోనే ట్రెండింగ్‌లో కనిపించిన పుష్ప 2. ఫస్ట్ టైమ్ ఓ నెగెటివ్ న్యూస్‌తో వార్తల్లో కనిపిస్తోంది. ఏంటా న్యూస్ అనుకుంటున్నారా...? అయితే వాచ్ దిస్ స్టోరీ.అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప.
Updated on: Jul 29, 2025 | 9:39 PM

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. ఇదే సిరీస్‌లో వచ్చిన పుష్ప 2 ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఏకంగా బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది పుష్ప 2.

ఈ సినిమా సక్సెస్ యూనిట్ మొత్తంలో కొత్త జోష్ తీసుకువచ్చింది. ఇంత పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన మూవీ మీద మేజర్ కంప్లయింట్ ఇచ్చారు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. పుష్ప2లో విలన్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటించారు ఫాఫా.

అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ మలయాళ స్టార్ చేసిన కామెంట్స్‌తో ఆయన పుష్ప2 విషయంలో అంత హ్యాపీగా లేరనిపిస్తోంది. పేరు మెన్షన్ చేయకపోయినా... లాస్ట్ వన్ ఇయర్‌లో చేసిన ఓ సినిమా విషయంలో తాను ఫెయిల్ అయ్యా అన్నారు ఫహాద్.

ఈ కామెంట్ పుష్ప 2 గురించే అన్న టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 షూటింగ్ సమయంలోనూ రకరకాల వార్తలు వినిపించాయి. ఫహద్ కారణంగానే షూటింగ్ ఆలస్యమైందని, ఒక దశలో ఫహద్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది.

ఫైనల్‌గా ఫాఫా సినిమాలో కనిపించటంతో అవన్నీ రూమర్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు స్వయంగా ఫహద్ కంప్లయింట్ చేయటంతో సుకుమార్ వల్లే ఫహాద్ హర్ట్ అయ్యారా అన్న చర్చ మొదలైంది. ముందు చెప్పినట్టుగా ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేయకపోవటం వల్లే ఈ రచ్చంతా అన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ కామెంట్స్ మీద సుక్కు టీమ్ స్పందిస్తుందేమో చూడాలి.




