- Telugu News Photo Gallery Cinema photos Kingdom Movie Vijay Deverakonda 75 Feet Cutout In Sudarshan Theater Hyderabad
Kingdom: ఈ అభిమానం ఏంటీ భయ్యా.. విజయ్ దేవరకొండ భారీ కటౌట్ చూశారా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ కింగ్ డమ్. విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా కనిపించనుంది. జూలై 31న ఈ మూవీ రిలీజ్ కానుంది.
Updated on: Jul 30, 2025 | 9:45 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మిస్తున్నారు.

విడుదలకు ముందే పోస్టర్స్, సాంగ్స్ ద్వారా క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ హైప్ క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ 75 అడుగుల విజయ్ దేవరకొండ కటౌట్ ఏర్పాటు చేశారు. కింగ్ డమ్ మూవీ లుక్ లో విజయ్ భారీ కటౌట్ పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రస్తుతం విజయ్ భారీ కటౌట్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పనిచేశారని.. అభిమానులకు కచ్చితంగా ఈ మూవీ నచ్చుందని ప్రీ రిలీజ్ వేడుకలో అన్నారు విజయ్ దేవరకొండ. అభిమానులు తనకు దేవుడు ఇచ్చిన వరమని అన్నారు.

కింగ్ డమ్ సినిమా విజయ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలుస్తుందని అన్నారు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. ఈ సినిమాకు ఆయన సంగీతం అందిస్తుండగా.. ఇదివరకు విడుదలైన పాటలు ఆకట్టుకున్నాయి. ‘కింగ్‌డమ్’ కథ చాలా బలంగా, అద్భుతంగా ఉందని ట్రైలర్ తో స్పష్టమైంది.




