- Telugu News Photo Gallery Cinema photos Faria Abdullah Shares Glamours Stunning Saree Look Photos Goes Viral
Faria Abdullah: ఆఫర్స్ కోసం చిట్టి వెయిటింగ్ ఇక్కడ.. గ్లామర్ ఫోజులతో రచ్చ రచ్చ..
మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఫరియా అబ్దుల్లా. అందం, అభినయం, చిలిపితనంతో కుర్రకారును కట్టిపడేసింది. ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజన్స్తో మెస్మరైజ్ చేసింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది ఈ వయ్యారి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
Updated on: Jul 30, 2025 | 1:05 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా ఒకరు. ఫస్ట్ మూవీ నుంచే తన ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం కామెడీ రోల్స్ మాత్రమే కాకుండా గ్లామర్ లుక్స్ లోనూ కట్టిపడేసింది.

సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేసే ఫరియా.. తాజాగా చీరలో గ్లామరస్ ఫోటోస్ పంచుకుంది. ట్రాన్స్ పరెంట్ స్టైలిష్ చీరలో ఫరియా వేసిన హావభావాలు అద్భుతంగా ఆకర్షిస్తున్నాయి. మత్య్సకన్య వైబ్స్ అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ కు తగ్గట్టే.. ఆమె లుక్ మరింత అందంగా కనిపిస్తుంది.

చీరతోపాటు స్లీవ్ లెస్ బ్లౌజ్, లాంగ్ హెయిర్, కాంతివంతమైన మేకప్ ఆమె లుక్ ను మరింత హైలెట్ చేస్తున్నాయి. కెమెరా ముందు సునాయాసంగా ఇచ్చిన ఫోజులు చూసి ఫ్యాషన్ ప్రేమికులు ఫిదా అవుతున్నారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఫరియా.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ స్థాయిలో హిట్స్ అందుకోలేకపోయింది. అయినా స్క్రీన్ ప్రెజన్స్, డ్యాన్సింగ్ స్కిల్స్ కామెడీ టైమింగ్ తో జనాల హృదయాలను గెలుచుకుంది. సినిమాలతోపాటు పలు ఓటీటీ ప్రాజెక్టులలోనూ మెరిసింది.

అందం, అభినయంతో కట్టిపడేస్తోన్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు. దీంతో నిత్యం గ్లామరస్ లుక్స్ తోపాటు ట్రెడిషనల్ డ్రెస్స్ లో కనిపిస్తుంది ఈ అమ్మడు. తాజాగా ఈ ముద్దుగుమ్మ లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.




