- Telugu News Photo Gallery Cinema photos Actress Sonali Bendre Shares Pink Colour Saree Photos Goes Viral
Sonali Bendre: ఆ అందమేంటి మేడమ్.. 50 ఏళ్ల వయసులో సోనాలి బింద్రే బ్యూటిఫుల్ లుక్స్..
సాధారణంగా సినీరంగంలోకి చాలా మంది హీరోయిన్స్ వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొందరు మాత్రం తమదైన ముద్ర వేస్తుంటారు. ఒకప్పుడు అందం, అభినయంతో కట్టిపడేసిన తారలు ఇప్పుడు మాత్రం బుల్లితెరపై మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో సోనాలి బింద్రే ఒకరు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
Updated on: Jul 30, 2025 | 3:43 PM

సోనాలి బింద్రే.. దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. తెలుగు, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి జోడిగా ఇంద్ర సినిమాలో మెరిసింది. అలాగే నాగార్జునతో మన్మథుడు, మహేష్ బాబుతో మురారి సినిమాల్లో కనిపించింది.

తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందమైన ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా పింక్ కలర్ చీరకట్టులో సింపుల్ లుక్స్ లో ఎంతో అందంగా కనిపిస్తుంది. 50 ఏళ్ల వయసులోనూ ఎంతో అందంగా కనిపిస్తుంది.

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సోనాలి.. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై యాక్టివ్ గా కనిపిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో అందమైన ఫోటోస్ షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

2001లో మహేష్ బాబు జోడిగా మురారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. తెలుగులో ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

తెలుగులో మురారి, ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు హిందీలోనూ అనేక చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది బి హ్యాపీ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది సోనాలి.




