- Telugu News Photo Gallery Cinema photos Kingdom Movie Will Vijay Deverakonda's New Film Match Arjun Reddy's Success
Kingdom: ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పెరిగిన కింగ్‌డమ్ హైప్.. సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడం పక్కా అంటున్న ఫ్యాన్స్
ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో కింగ్‌డమ్ మేనియా కంటిన్యూ అవుతోంది. ట్రైలర్ రిలీజ్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్... ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఆ హైప్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఈ బజ్ చూసి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళుతున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కింగ్డమ్.
Updated on: Jul 29, 2025 | 9:33 PM

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కింగ్డమ్. డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆల్రెడీ ప్రమోషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఈ వైబ్ చూసిన ఆడియన్స్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళుతున్నారు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి పీరియడ్‌ను గుర్తు చేసుకుంటున్నారు రౌడీ బాయ్స్.

విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్‌ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి. అప్పటి వరకు ఉన్న సినిమాటిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ వచ్చిన ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తరువాత గీత గోవిందం విషయంలో మరోసారి అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశారు రౌడీ హీరో.

అర్జున్ రెడ్డి ఇమేజ్‌కు పూర్తి కాంట్రాస్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా కూడా బిగ్ హిట్ అయ్యింది. ఇప్పుడు కింగ్డమ్ కోసం మరోసారి తన కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చారు విజయ్ దేవరకొండ.

స్టోరీ సెలక్షన్, లుక్, డైలాగ్స్ ఇలా ప్రతీ విషయంలోనూ డిఫరెంట్‌గా ట్రై చేశారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్, సినిమా మీద అంచనాలు పెంచేసింది. అందుకే కింగ్డమ్ కూడా అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సెన్సేషనల్ మూవీ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు రౌడీ హీరో ఫ్యాన్స్.




