Worm Selling on Amazon : అమెజాన్‌లో అమ్ముడవుతున్న పురుగు..! దీని స్పెషల్ ఏంటో తెలిస్తే షాక్ తింటారు..?
Worm Selling on Amazon : అమెజాన్‌లో గ్రాసరీస్‌తో పాటు ఒక రకమైన పురుగులను కూడా విక్రయిస్తున్నారు. వినడానికి
Worm Selling on Amazon : అమెజాన్‌లో గ్రాసరీస్‌తో పాటు ఒక రకమైన పురుగులను కూడా విక్రయిస్తున్నారు. వినడానికి ఇది వింతగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ఆ పురుగులకు చాలా ప్రత్యేకత ఉంది. మనం పర్యవరణాన్ని కాపాడటానికి చాలాసార్లు ప్లాస్టిక్ వాడమని చెప్పి కొన్నిరోజులకు మళ్లీ వాడతాం. కానీ ఈ పురుగు అలా కాదు మనం వాడే ప్లాస్టిక్ వస్తువులన్నిటిని తింటూ మన పర్యవరణాన్ని కాపాడటానికి దోహదం చేస్తుంది. అందుకే దీనికి క్రేజ్. అమెజాన్‌ల్ అర్డర్ చేసి మరీ కొంటున్నారు. ఇప్పుడు ఈ పురుగు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్లాస్టిక్ వ్యర్థాలను వదిలించుకునే ఈ పురుగు పేరు మీల్వార్మ్. ఈ కీటకాలు ప్లాస్టిక్ వంటి క్షీణించని వస్తువులను తింటాయి. ఇలా చేయడం ద్వారా ఈ కీటకాలు పర్యావరణాన్ని కాపాడతాయి. డ్యూయిష్ వెల్లె నివేదిక ప్రకారం.. 2017 సంవత్సరంలో ప్రసిద్ధ జీవశాస్త్రవేత్త ఫెడెరికా బెర్టోచిని వీటిని కనుగొన్నాడు. తేనెటీగను శుభ్రపరిచేటప్పుడు, అతను ఈ కీటకాలను చూశాడు. వీటిని ఒక ప్లాస్టిక్ సంచిలో నింపాడు. అవి దానిని తిని బయటికి వచ్చేవి. ఇలా చాలా సార్లు చేశాడు. చివరకు ఇవి ప్లాస్టిక్‌ను తింటున్నాయని అర్థం చేసుకున్నాడు.
ఈ కీటకాలు ఆన్‌లైన్‌లో కూడా కనిపిస్తున్నాయి మీల్ వార్మ్ (ప్లాస్టిక్ ఈటర్ వార్మ్స్) ప్లాస్టిక్-నాశనం చేయడమే కాదు ఇవి చాలా రకాలుగా ఉపయోగపడుతాయి. కోళ్లు లేదా ఇతర పక్షులకు ఫీడ్‌గా, చేపలను పట్టుకోవడంలో ఎరగా వీటిని వినియోగిస్తారు. ఇది వింతగా అనిపిస్తుంది కానీ అది జరుగుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సైట్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.