Bank Charges: మీ ఖాతా నుంచి బ్యాంకులు ఎన్ని రకాల ఛార్జీలు వసూలు చేస్తాయో తెలుసా..? పూర్తి వివరాలు తెలుసుకోండి

Bank Charges: మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉందా.? ఓసారి ఖాతా యొక్క స్టేట్‌మెంట్‌ను చెక్‌ చేసుకోండి. మీ విత్‌డ్రాలు, ఇతర చార్జీల గురించి తెలుసుకుని ఉండరు. మీరు ట్రాన్స్‌ఫర్..

Bank Charges: మీ ఖాతా నుంచి బ్యాంకులు ఎన్ని రకాల ఛార్జీలు వసూలు చేస్తాయో తెలుసా..? పూర్తి వివరాలు తెలుసుకోండి
Bank Charges
Follow us
Subhash Goud

|

Updated on: Jun 15, 2021 | 1:30 PM

Bank Charges: మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉందా.? ఓసారి ఖాతా యొక్క స్టేట్‌మెంట్‌ను చెక్‌ చేసుకోండి. మీ విత్‌డ్రాలు, ఇతర చార్జీల గురించి తెలుసుకుని ఉండరు. మీరు ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బులు, మీ అకౌంట్‌లో క్రెడిట్ అయిన అమౌంట్ మాత్రమే కాదు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో మీరు చెల్లిస్తున్న ఛార్జీల గురించి గమనించాలి. ప్రతి కస్టమర్‌ నుంచి బ్యాంకులు కొన్ని రకాల ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాష్‌ ట్రాన్సాక్షన్స్‌:

మీ డబ్బుతోనే మీరు ట్రాన్సాక్షన్స్‌ చేస్తారు. అయినా క్యాష్‌ ట్రాన్సాక్షన్స్‌కు ఒక లిమిట్‌ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే బ్యాంకులు క్యాష్ ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే కాదు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ ఛార్జీలు వసూలు చేస్తాయి. ఉదాహరణకు చెప్పాలంటే ఓ బ్యాంకులో నాలుగు ఉచిత ట్రాన్సాక్షన్స్, క్యాష్ విత్‌డ్రాయల్స్ లేదా నెలకు రూ.2,00,000 ట్రాన్సాక్షన్స్ ఉచితం. అది లిమిట్‌ దాడినట్లయితే మీరు డ్రా చేసే ప్రతీ రూ.1,000 కి రూ.10 లేదా రూ.150 ఛార్జీ చెల్లించాలి.

ఏటీఎం విత్‌డ్రాయల్స్‌ ఛార్జీలు:

మీరు ఏటీఎం నుంచి కూడా విత్‌ డ్రా చేసుకుంటే కూడా ఛార్జీలు వసూలు చేస్తాయి బ్యాంకులు. మీకు ఉన్న ఫ్రీ ట్రాన్సాక్షన్స్ లిమిట్ దాటిన తర్వాత ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు ప్రతీ లావాదేవి రూ.20 నుంచి రూ.50 వరకు ఛార్జీలు చెల్లించాలి. వివిధ బ్యాంకుల ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి.

డెబిట్‌ కార్డు ఛార్జీలు:

మీ ఏటీఎం కార్డు పోయిందా? కొత్త కార్డు కావాలంటే రూ.50 నుంచి రూ.500 వరకు ఛార్జీలు చెల్లించాలి. ఖాతా తెరిచినప్పుడు మొదటిసారి మాత్రమే ఏటీఎం కార్డు ఉచితంగా వస్తుంది. ఆ తర్వాత కార్డు పోయినా.. కొత్త కార్డు కావాలన్నా ఛార్జీలు తప్పకుండా చెల్లించాలి.

మినిమమ్‌ బ్యాలెన్స్‌:

మీ అకౌంట్‌లో బ్యాలెన్స్‌ లేకపోతే కూడా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్సు ఉండాల్సిందే. రూరల్, అర్బన్, మెట్రో నగరాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ వేర్వేరుగా ఉంటాయి.

చెక్‌ ఛార్జీలు:

మీరు ఎవరికైనా చెక్‌ ఇచ్చారంటే అందుకు ఛార్జీలు కూడా ఉంటాయి. ఒక చెక్ క్లియర్ కావడానికి రూ.150 వరకు ఛార్జీలు చెల్లించాలి. అయితే రూ.1,00,000 కన్నా ఎక్కువ విలువ ఉన్న చెక్స్‌కి మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.1,00,000 లోపు చెక్స్‌కి ఛార్జీలు ఉండవు.

ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు:

మీ అకౌంట్‌లో జరిగే లావాదేవీలపై ఎస్ఎంఎస్‌లు మీ మొబైల్‌కు వస్తుంటాయి. అందుకు కూడా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్‌ అలర్ట్స్ పంపడానికి కూడా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. ఈ ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతుంటాయి.

ఐఎంపీఎస్‌ మనీ ట్రాన్సాక్షన్స్‌ ఛార్జీలు:

ఐఎంపీఎస్‌ మనీ ట్రాన్సాక్షన్స్‌ నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ సేవలు ఉచితంగా ఉంటాయి. ఒక వేళ మీరు అత్యవసరంగా డబ్బులు వేరే వ్యక్తికి పంపాలంటే ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా డబ్బులు పంపితే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు మీరు పంపే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. రూ.1 నుంచి రూ.25 వరకు ఛార్జీలు పడుతుంటాయి.

డాక్యుమెంట్‌ ఛార్జీలు:

బ్యాంకు నుంచి ఏవైనా డాక్యుమెంట్స్ పొందాలంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు ఏడాదికి ఒకసారి యాన్యువల్ స్టేట్‌మెంట్‌ను ఉచితంగా ఇస్తాయి. డూప్లికేట్ అకౌంట్ స్టేట్‌మెంట్ కావాలంటే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించాలి. కాగా, ఇవీ మాత్రమే కాకుండా బ్యాంకులు అనేక రకమైన ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. అకౌంట్ క్లోజర్, కొత్త చెక్ బుక్, ఔట్ స్టేషన్ చెక్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, డిమాండ్ డ్రాఫ్ట్స్, రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్, పిన్ రీజెనరేషన్, లాకర్ రెంట్ లాంటి ఛార్జీలు కూడా ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు మీరు మీ బ్యాంకు స్టేట్‌మెంట్‌ను చెక్‌ చేస్తూ ఉండండి. అప్పుడే బ్యాంకులు ఏయే ఛార్జీలు వసూలు చేస్తున్నాయో తెలుస్తుంది.

ఇవీ కూడా చదవండి

Jan Dhan Yojana: మీకు జన్‌ధన్‌ ఖాతా ఉందా..? రూ.2 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం.. క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా..?

SBI Customer Alert: మీకు ఎస్‌బీఐ నుంచి గిఫ్ట్‌ వచ్చిందంటూ మెసేజ్‌ వచ్చిందా.. ? అయితే ఇలా చేయండి..!

SBI Customer Alert: ఇలా చేస్తే మీరు ఇబ్బందులు పడాల్సిందే.. మరోసారి ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ..!

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..