Jan Dhan Yojana: మీకు జన్‌ధన్‌ ఖాతా ఉందా..? రూ.2 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం.. క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా..?

Jan Dhan Yojana: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోదారులకు పలు రకాల ప్రయోజనాలను అందిస్తోంది. తాజాగా తన కస్టమర్లకు..

Jan Dhan Yojana: మీకు జన్‌ధన్‌ ఖాతా ఉందా..? రూ.2 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం.. క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా..?
Jan Dhan Yojana
Follow us
Subhash Goud

|

Updated on: Jun 16, 2021 | 3:08 PM

Jan Dhan Yojana: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోదారులకు పలు రకాల ప్రయోజనాలను అందిస్తోంది. తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. అదే ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’. ఈ పథకంలో భాగంగా ఖాతా తెరిచిన వారికి ఈ సౌకర్యాలు లభిస్తాయి. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే మంచి బెనిఫిట్‌ అని చెప్పాలి. ఎస్‌బీఐ రూపే డెబిట్‌ కార్డు ఉపయోగించే అన్ని జన్‌ధన్‌ ఖాతాలకు రూ.2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా కవరేజ్‌ అందిస్తోంది.2014లో ప్రారంభమైన ప్రధాన్‌ మంత్రి జన్‌ ధన్‌ యోజన పథకం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ పథకం ద్వారా ఎస్బీఐ రూపే జన్ ధన్ కార్డును జన్ ధన్ ఖాతాదారులకు అందిస్తోంది. దీని ద్వారా ఈ కార్డు కలిగిన కస్టమర్లను రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ సౌకర్యం అందిస్తోంది. అయితే రూపే కార్డ్ మీ ఎటిఎం లాగా పనిచేస్తుంది. దీని సహయంతో మీ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు. అలాగే షాపింగ్స్ కూడా చేసుకోవచ్చు.

జన్ ధన్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి..

ఇప్పటివరకు మీరు జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయకపోతే.. మీ సమీప బ్యాంకుకు వెళ్లి.. జనధన్ ఫారం పూర్తి చేయాలి. అందులో మీ పేరు, మొబైల్ నంబర్, చిరునామా, వ్యాపారం, ఉపాధి, వార్షిక ఆదాయం ఆధారపడిన వారి సంఖ్య, నామిని మొదలైనవి నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవైనా డౌట్స్  ఉంటే బ్యాంకు సిబ్బందికి అడిగినా చెబుతారు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సహ కేవైసీకి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాలి.ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

అలాగే ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఈ ఖాతా ఆన్‌లైన్‌లో కూడా ఓపెన్‌ చేసు వరకు తెరిచిన జన్‌ధన్‌ ఖాతాలపై జారీ చేసిన రూపే కార్డులకు ప్రమాద బీమా రూ. 2 లక్షల వరకు లభిస్తుంది. ఈ ప్రమాద బీమా పొందే సమయంలో అవరమైన డాక్యుమెంట్లు సమర్పించినట్లుతే క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని నామినీగా ఉన్న వ్యక్తికి అందించబడుతుంది.

క్లెయిమ్‌ చేయడానికి కావాల్సిన పత్రాలు

1) క్లెయిమ్ చేసుకునే పత్రంపై సంతకం 2) మరణ ధృవీకరణ ప్రతం 3) ప్రమాదం గురించి వివరణ ఇచ్చే పోలీసు స్టేషన్‌ యొక్క ఎఫ్‌ఐఆర్‌ కాపీ. 4) మరణం తర్వాత పోస్టుమార్టం నివేదిక పత్రం 5) కార్డుదారుని నామినీగా ఉన్న వ్యక్తి ఆధార్‌ కాపీ 6) జన్‌ధన్‌ కార్డు జారీ చేసిన బ్యాంకు నుంచి అధికారికంగా సంతకం చేసిన పత్రం. కస్టమర్‌కు జారీ చేసిన రూపే కార్డు నెంబర్‌ తప్పనిసరి. నామినీ పేరుపై ఉన్న బ్యాంకింగ్‌ వివరాలు.

పత్రాలు సమర్పించిన తేదీ నుంచి పది పని దినాలలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ ప్రయోజనాలు మార్చి 31,2022 వరకు బెనిఫిట్స్‌ అందుకోవచ్చు. కాగా, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ రూపే పీఎమ్‌ జేడీవై కార్డుల కోసం ఎన్‌పీసీఐతో బీమా భాగస్వామిగా కొనసాగుతోంది.

ఇవీ కూడా చదవండి:

SBI Customer Alert: మీకు ఎస్‌బీఐ నుంచి గిఫ్ట్‌ వచ్చిందంటూ మెసేజ్‌ వచ్చిందా.. ? అయితే ఇలా చేయండి..!

SBI Customer Alert: ఇలా చేస్తే మీరు ఇబ్బందులు పడాల్సిందే.. మరోసారి ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ..!

ATM Currency: ఏటీఎం నుంచి చిరిగిన, చెల్లని నోట్లు వచ్చాయా..? ఇలా చేసి మంచి నోట్లు తీసుకోండి..!