Xiaomi Mi Watch: కొత్త స్మార్ట్ వాచ్‌ను విడుదల చేయనున్న ఎంఐ.. అత్యాధునిక ఫీచర్లు.. పూర్తి వివరాలు
Xiaomi Mi Watch: కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు కొత్త కొత్త మొబైల్‌లు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి ప్రముఖ మొబైల్ కంపెనీలు. ఇక అత్యాధునిక టెక్నాలజీతో..
Xiaomi Mi Watch: కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు కొత్త కొత్త మొబైల్‌లు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి ప్రముఖ మొబైల్ కంపెనీలు. ఇక అత్యాధునిక టెక్నాలజీతో కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకుస్తున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ.. స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేయనుంది. తన బ్రాండ్‌ను జూన్ 22వ తేదీన విడుదల చేయనుంది. అదే రోజు భారత్‌లో ఎంఐ 11 లైట్ స్మార్ట్ ఫోన్ కూడా విడుదల కానుంది. ఇక తాజాగా ఎంఐ వాచ్ రివాల్వ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్‌ను కూడా విడదుల చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఎంఐ 11 లైట్ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుండగా, వాచ్ మాత్రం అమెజాన్, ఎంఐ.కాంల్లో అందుబాటులోకి రానుంది. అయితే గత సంవత్సరం మన దేశంలో విడుదలైన ఎంఐ వాచ్ రివాల్వ్‌కి తర్వాతి వెర్షన్‌గా ఈ వాచ్ మార్కెట్లో తీసుకురానుంది. దీని ధర భారత్‌లో రూ.10,999గా ఉంది.
ఈ లిస్టింగ్ ప్రకారం.. అమెజాన్ ఎంఐ వాచ్ రివాల్వ్ యాక్టివ్‌కు సంబంధించిన లిస్టింగ్‌ను కూడా అందించింది. ఎంఐ వాచ్ రివాల్వ్ యాక్టివ్ డిజైన్ కూడా ముందు వెర్షన్ లాగానే ఉండనుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ఎస్‌పీఓ2 మానిటరింగ్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉండనుంది. హార్ట్ రేట్ మానిటర్, బిల్ట్-ఇన్ జీపీఎస్, స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ నోటిఫికేషన్ వంటి ఎన్నో ఫీచర్లను ఎంఐ ఇందులో అందించనుంది.
ఎంఐ వాచ్ రివాల్వ్‌లో 1.39 అంగుళాల గుండ్రటి డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 454 × 454 పిక్సెల్స్‌గా ఉంది. స్మార్ట్ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. దాదాపు 110కి పైగా వాచ్ ఫేసెస్‌నను ఇందులో అందించారు. ఇందులో బ్యాటరీ సామర్థ్యం 420 ఎంఏహెచ్‌గా ఉంది. ఒక్కసారి చార్జ్ పెడితే దాదాపు 15 రోజుల వరకు చార్జీంగ్ వచ్చే అవకాశం ఉంది. బ్లూటూత్ 5.0, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని అత్యాధునిక ఫీచర్స్‌ను ఇందులో ఉండనున్నాయి.
Welcome, to the era of choosing health over everything.
To living mindfully and consciously To happier minds and healthier bodies To always getting more from life
Welcome, to #WatchfulLiving with #MiWatchRevolveActive – https://t.co/bYDZ1dwDCb
Coming soon! pic.twitter.com/62beTWCGtH
— Mi India (@XiaomiIndia) June 14, 2021