AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3D Printed Masks: కోవిడ్‌ వైరస్‌ అంతం చేసేందుకు సరికొత్త మాస్కులు వచ్చేశాయి.. త్రీడి టెక్నాలజీతో తయారీ

3D Printed Masks: కోవిడ్‌ను అంతమొందించేందుకు రకరకాల టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నారు పరిశోధకులు. ఇప్పటికే కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌,..

3D Printed Masks: కోవిడ్‌ వైరస్‌ అంతం చేసేందుకు సరికొత్త మాస్కులు వచ్చేశాయి.. త్రీడి టెక్నాలజీతో తయారీ
3D printing Mask
Subhash Goud
|

Updated on: Jun 15, 2021 | 11:25 AM

Share

3D Printed Masks: కోవిడ్‌ను అంతమొందించేందుకు రకరకాల టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నారు పరిశోధకులు. ఇప్పటికే కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌, లాక్‌డౌన్‌, ఇతర మందులు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక వైరస్‌ నుంచి రక్షించుకోవాలంటే ముందుగా మాస్క్‌లు ధరించడం తప్పని సరి అయ్యింది. మాస్కుల్లో కూడా రకరకాలుగా అందుబాటులోకి వచ్చాయి. ఇక తాజాగా పూణే కేంద్రంగా పని చేస్తున్న థింకర్ టెక్నాలజీస్ ఇండియా సరికొత్త మాస్కులను తయారు చేసింది. వైరస్‌ను అంత చేసేందుకు సరికొత్త మాస్కులను అభివృద్ధి చేసింది. 3డి ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును థింకర్ టెక్నాలజీస్ ఇండియా తయారు చేసింది. స్టార్టప్ సంస్థగా ఏర్పాటైన థింకర్ టెక్నాలజీస్ ఇండియా కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టే మాస్కుల తయారీపై పరిశోధనలుచేసి, ఇన్నోవేటివ్ 3డి మాస్కులను అభివృద్ధి చేసింది.

కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా థింకర్ టెక్నాలజీస్ ఇండియా అభివృద్ధి చేసిన మాస్కులను వాణిజ్యపరంగా ప్రోత్సహించడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ ఎంపిక చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు ఈ టెక్నాలజీతో తయారు చేస్తున్న మాస్కులకు నిధులను కూడా సమకూర్చింది. మాస్కుల తయారీపై 2020 జులై 8న థింకర్ టెక్నాలజీస్ ఇండియా ఒప్పందంపై సంతకం చేసింది. సాధారణ ఎన్ 95, 3ప్లే, కాటన్ మాస్కులతో పోల్చి చూస్తే తాము అభివృద్ధి చేసిన మాస్క్ కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి సమర్ధవంతంగా పనిచేస్తుందని థింకర్ టెక్నాలజీస్ ఇండియా పేర్కొన్నది.

Covid-19 Vaccine: వ్యాక్సిన్ తీసుకున్న వారికి బంపర్ ఆఫర్‌.. టీకా తీసుకోండి.. కారు గెలుచుకోండి

New Covid Sensor: కొత్త కోవిడ్‌ సెన్సార్‌.. వాసన ద్వారా కోవిడ్‌ సోకిన వారిని గుర్తింపు