AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Covid Sensor: కొత్త కోవిడ్‌ సెన్సార్‌.. వాసన ద్వారా కోవిడ్‌ సోకిన వారిని గుర్తింపు

New Covid Sensor: కరోనా మహమ్మారి వల్ల ఎందరో బలవుతున్నారు. కంటికి కనిపించని వైరస్‌తో మానవుడు పోరాడుతున్నారు. కరోనా కట్టడకి ఒక వైపు వ్యాక్సినేషన్‌, లాక్‌డౌన్‌ ఆంక్షలు..

New Covid Sensor: కొత్త కోవిడ్‌ సెన్సార్‌.. వాసన ద్వారా కోవిడ్‌ సోకిన వారిని గుర్తింపు
Subhash Goud
|

Updated on: Jun 14, 2021 | 11:24 AM

Share

New Covid Sensor: కరోనా మహమ్మారి వల్ల ఎందరో బలవుతున్నారు. కంటికి కనిపించని వైరస్‌తో మానవుడు పోరాడుతున్నారు. కరోనా కట్టడకి ఒక వైపు వ్యాక్సినేషన్‌, లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతుంటే మరో వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఫస్ట్‌వేవ్‌ కంటే సెకండ్‌వేవ్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే ఇక థర్డ్‌వేవ్‌ కూడా పిల్లలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని ఇప్పటికే పరిశోధకులు వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనాపై రకరకాల పరిశోధనలు కొనసాగిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల బృందం కోవిడ్‌ సెన్సార్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఒక గదిలో ఎవరైనా 15 నిమిషాల వ్యవధిలో కరోనా వైరస్‌ బారిన పడ్డారా లేదా అనే విషయాన్ని ఈ సెన్సార్‌ గుర్తిస్తుంది. విమానం క్యాబిన్‌లు, కేర్‌ హోమ్స్‌, తరగతి గదులు, కార్యాలయాలలో దీనిని అమర్చినట్లయితే ఎంతగానే ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్‌షైర్ ఆధారిత సంస్థ రోబో సైంటిఫిక్‌ చేత సృష్టించబడిన ఈ పరికరం కోవిడ్‌ సోకిన వారి వాసనను గుర్తిస్తుంది.

ఈ పరికరాన్ని మొదటగా లండన్‌లోని ఓ యూనివర్సిటీలో ఉంచి పరిశీలించారు. కరోనా సోకిన వ్యక్తుల వద్ద ఉండే స్నాక్స్‌ నుంచి, శరీర నమూనాలను ఉపయోగించి పరికరంతో పరీక్షించారు. 98 నుంచి 100 శాతం వైరస్‌ను గుర్తించగలిగింది. పీసీఆర్‌ పరీక్షల కంటే వేగంగా ఇది గుర్తించగలదని పరిశోధకులు తేల్చారు. అలాగే పరిశోధకులు 54 మందిపై ఈ పరీక్షలు ప్రయోగించగా, అందులో 27 మందికి కోవిడ్‌ సోకినట్లు తేల్చారు.

కాగా, గత ఏడాది కిందటి నుంచి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాపై శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. కరోనా కట్టడికి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఇప్పటికే శునకాలకు కూడా మనుషుల వాసన ద్వారా కరోనా సోకిన వారిని గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. శునకాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఎలాంటి పరీక్షలు లేకుండా మనిషి చెమట వాసన ద్వారా గుర్తించవచ్చని తేల్చారు. కరోనా వచ్చిన నాటి నుంచి పరిశోధకులు రకరకాల పరిశోధనలు కొనసాగిస్తున్నారు. తాజాగా సెన్సార్‌ ద్వారా గదిలో ఉండే మనిషి యొక్క వాసన ద్వారా కరోనాను గుర్తించే పరికరాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. దీని వల్ల మరింత సులభతరం కానుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలా కరోనాను గుర్తించేందుకు రకరకాల పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. సెకండ్‌వేవ్‌లో తీవ్రస్థాయిలో విజృంభించిన కరోనా.. థర్డ్‌వేవ్‌ రాబోతోంది. అంతేకాదు మరిన్ని వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని, అందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు ఇప్పటికే సూచించారు.

ఇవీ కూడా చదవండి:

Covid 19 Third Wave: కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..?

Digestive Problems : కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో జీర్ణ సమస్యలు..! సెకండ్ వేవ్‌లో పెరుగుతున్న ఈ రకం కేసులు..