AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీ-7 సమ్మిట్ లో ‘సైకిల్ గిఫ్ట్’……ఎవరు…ఎవరికి ఇచ్చారంటే…? పరస్పర బహుమతుల మధ్య శిఖరాగ్ర సమావేశం

బ్రిటన్ లో జరుగుతున్న జీ-7 సమ్మిట్ సందర్భంగా ఎవరూ ఊహించని 'ఘటన' జరిగింది.. మరేం లేదు....అమెరికా-బ్రిటన్ మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావాలంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ...

జీ-7 సమ్మిట్ లో  'సైకిల్ గిఫ్ట్'......ఎవరు...ఎవరికి ఇచ్చారంటే...? పరస్పర బహుమతుల మధ్య శిఖరాగ్ర సమావేశం
Customized 6000 Dollars Bik
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 14, 2021 | 10:26 AM

Share

బ్రిటన్ లో జరుగుతున్న జీ-7 సమ్మిట్ సందర్భంగా ఎవరూ ఊహించని ‘ఘటన’ జరిగింది.. మరేం లేదు….అమెరికా-బ్రిటన్ మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావాలంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ …బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కి ఓ చక్కని సైకిల్ ని గిఫ్ట్ గా అందజేశారు. యంత్రాలతో కాకుండా పూర్తిగా చేత్తోనే తయారు చేసిన సైకిల్ ఇది… 6 వేల డాలర్ల ఖరీదైన ఈ చిన్ని వాహనం విశేషాలు చాలానే ఉన్నాయి. బానిసత్వానికి వ్యతిరేకంగా 19 వ శతాబ్దంలో ప్రచారం చేసిన ఫ్రెడరిక్ డగ్లస్ ఫోటో ఈ సైకిల్ పై ఉంది.. సైకిల్ క్రాస్ బార్ మీద బ్రిటిష్ యూనియన్ జాక్ తో బాటు ఈ ఇద్దరు ప్రపంచ నేతల సంతకాలు…హెడ్ ట్రూబ్ పై అమెరికా-బ్రిటిష్ జాతీయ పతాకాలను కూడా ‘డెకరేట్’ చేశారు. ఇక బోరిస్ జాన్సన్ కూడా బైడెన్ కి ఫ్రెడరిక్ డగ్లస్ ఫోటోను బహుకరించారు. 19 వ శతాబ్దంలో డగ్లస్ ఓ బానిస కూడా.. కానీ ఆ తరువాత తానే దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి పాపులర్ అయ్యాడు. ఇతని ఫోటోను అమెరికా-యూకే రెండు దేశాల పౌరసత్వం పొందిన మెలీసా హైటన్ అనే వ్యక్తి సేకరించారు.బైడెన్, జాన్సన్ భార్యలు కూడా ఒకరికొకరు బహుమతులు అందజేసుకున్నారు.

ఇక జొబైడెన్….జాన్సన్ కి గిఫ్ట్ గా ఇచ్చిన సైకిల్ వెనుక కథ ఒకటుంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో దీన్ని తయారు చేశారు. బైలెంకీ సైకిల్ వర్క్స్ అనే సంస్థలోని కేవలం నలుగురు ఉద్యోగులు దీన్ని రూపొందించారు. వీరు చేతులతోనే ఒక్కో సైకిల్ ని సుమారు 18 నెలలు శ్రమించి తయారు చేస్తారట.. గత మే నెల 23 నే ఈ సైకిల్ తయారీకి వీరికి ఆర్డర్ వచ్చింది. బోరిస్ జాన్సన్ కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం.. తరచూ తన సెక్యూరిటీతో లండన్ వీధుల్లో సైకిల్ తొక్కుతుంటారు.

మరిన్ని  ఇక్కడ చూడండి: Kim Jong Un: మరో ‘వార్‌’కు తెరలేపిన కిమ్.. క్రూరత్వానికి పరాకాష్ట.. తేడా వస్తే మరణశిక్షే.!

Jaggu Bhai: ఆనందయ్య మందు ఎఫెక్ట్..!! బాబు వర్సెస్ బాబు.. మధ్యలో ఆనందయ్య… ( వీడియో )