AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kim Jong Un: మరో ‘వార్‌’కు తెరలేపిన కిమ్.. క్రూరత్వానికి పరాకాష్ట.. తేడా వస్తే మరణశిక్షే.!

Kim Jong Un: ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ను సాటి ఎవ్వరూ లేరు. ఆయన తాజాగా మరో వార్‌కు తెరలేపారు. పొరుగు దేశం..

Kim Jong Un: మరో 'వార్‌'కు తెరలేపిన కిమ్.. క్రూరత్వానికి పరాకాష్ట.. తేడా వస్తే మరణశిక్షే.!
Kim Jong Ub
Ravi Kiran
|

Updated on: Jun 14, 2021 | 10:05 AM

Share

ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ను సాటి ఎవ్వరూ లేరు. ఆయన తాజాగా మరో వార్‌కు తెరలేపారు. పొరుగు దేశం దక్షిణ కొరియాపై ‘కల్చరల్ వార్’కు రంగం సిద్దం చేశారు. కొత్త చట్టాలను అమలులోకి తీసుకొచ్చి సౌత్ కొరియా ఆర్ధిక వ్యవస్థపై దెబ్బ కొట్టేందుకు సిద్దమయ్యారు. కొరియా పాప్ కల్చర్‌ను పూర్తిగా నిషేధించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఆ కల్చర్‌ను ‘ప్రమాదకరమైన క్యాన్సర్‌ వ్యాధి’గా అభివర్ణిస్తూ కిమ్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పొరుగు దేశపు సంస్కృతి, సంప్రదాయాలను అలవరుచుకోవద్దని దేశ యువతకు ఇప్పటికే కిమ్ హెచ్చరికలు జారీ చేసినట్లు ధృవీకరిస్తూ ది న్యూయార్క్‌ టైమ్స్‌‌లో ఓ కథనం ప్రచురితమైంది.

ఇదిలా ఉంటే కొరియన్ పాప్ కల్చర్‌ను ఆస్వాదించిన మొట్టమొదటి వ్యక్తి కిమ్ జాంగ్ ఉన్. డబ్బై ఏళ్ల కిమ్ ఫ్యామిలీలో దక్షిణ కొరియాకు చెందిన పాపులర్ పాప్ బ్యాండ్‌లతో తన రాజధాని ప్యోంగ్యాంగ్‌లో ప్రదర్శనలు ఇప్పించడమే కాకుండా.. వాటికి సంబంధించిన వేడుకలకు హాజరైన తొలి అధ్యక్షుడు కూడా ఈయనే. అయితే గత కొంతకాలంగా ఈ కల్చర్ కారణంగా నార్త్ కొరియా యువతలో విప్లవాత్మక మార్పులు వస్తుండటంతో.. ఎక్కడ వారిపై తాను పట్టుకోల్పోతానేమోనన్న ఉద్దేశంతో కిమ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల కొరియన్ పాప్ మార్కెట్‌కు కూడా దెబ్బ పడుతుందనే ఆలోచనలో కిమ్ ఉండొచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు.

మరోవైపు కిమ్ ఇటీవలే కొన్ని నూతన చట్టాలను అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వాటి ప్రకారం.. ఆ దేశంలోని ప్రజలెవ్వరూ కూడా జుట్టుకు రంగు వేయకూడదు. అంతేకాకుండా కిమ్ సూచించిన 215 హెయిర్ కట్స్‌కు మాత్రమే ఫాలో కావాలి. మిగతా దేశాలకు సంబంధించిన స్టైల్స్‌, వస్త్రాధారణను పౌరులు అస్సలు అనుసరించకూడదు. చిరిగిపోయిన జీన్స్, టీ షర్ట్స్‌లను యువత వేసుకోకూడదని.. అలాగే ముక్కు, పెదాలపై రింగులు ఉండకూడదని కిమ్ ఆదేశించారు. అటు సౌత్ కొరియా సినిమాలు, సంగీతం, వీడియోలను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తే కఠిన శిక్షకు అర్హులు.

15 ఏళ్ల జైలు శిక్ష కాస్తా మరణ శిక్షకు మార్పు..!

గతేడాది డిసెంబర్‌లో యాంటీ కొరియన్ పాప్ ఉద్యమానికి తెరలేపిన కిమ్.. నూతన చట్టాలను అమలులోకి తీసుకొచ్చాడు. దక్షిణ కొరియా పాటలు విన్నా, సినిమాలు, వీడియోలు చూసినా.. 15 ఏళ్ల కఠిన కారాగార శిక్షను అమలు చేస్తున్నారు. పిల్లలు ఈ తప్పు చేస్తే.. వారి తల్లిదండ్రులకు శిక్ష వేస్తున్నారు. అయితే ఈ శిక్షలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. పదిహేనేళ్ల శిక్షను.. మరణ శిక్షగా మార్చాలని కిమ్ ఆలోచిస్తున్నట్లు డెమొక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా పార్టీ వర్గాలు తెలిపాయి.

Also Read: ఏడాది గడుస్తున్నా తేలని సుశాంత్ డెత్ మిస్టరీ.. అతడు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ పదిలం