ఫుట్ బాల్ మాంత్రికుడు డీగో మారడోనా మృతిపై దర్యాప్తు ప్రారంభం …..రెండు వారాల ఇన్వెస్టిగేషన్

ఫుట్ బాల్ మాంత్రికుడు డీగో మారడోనా మృతిపై అర్జెంటీనా ప్రాసిక్యూటర్లు దర్యాప్తు ప్రారంభించారు. అతని పర్సనల్ డాక్టర్ ను, మరో ఆరుగురు సహాయకులను వారు ప్రశ్నించనున్నారు.

ఫుట్ బాల్ మాంత్రికుడు డీగో మారడోనా మృతిపై దర్యాప్తు ప్రారంభం .....రెండు వారాల ఇన్వెస్టిగేషన్
Diego Maradonas Doctor Six
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 14, 2021 | 11:15 AM

ఫుట్ బాల్ మాంత్రికుడు డీగో మారడోనా మృతిపై అర్జెంటీనా ప్రాసిక్యూటర్లు దర్యాప్తు ప్రారంభించారు. అతని పర్సనల్ డాక్టర్ ను, మరో ఆరుగురు సహాయకులను వారు ప్రశ్నించనున్నారు. మారడోనా మరణానికి వీరి నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆరోగ్యం పట్ల వీరు శ్రద్ధ తీసుకోలేదని, ఆయనను పట్టించుకోలేదని మారడోనా తరఫు లాయర్ గతంలోనే ఆరోపించారు. 60 ఏళ్ళ వయస్సులో మారడోనా గత నవంబరులో మరణించారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు ఆపరేషన్ చేసిన కొన్ని రోజులకే ఆయన గుండెపోటుతో చనిపోయారు. తమ తండ్రి మృతికి న్యూరో సర్జన్ లిపోల్డో ల్యూక్ కారణమంటూ మారడోనా అయిదుగురు పిల్లలు ఫిర్యాదు చేయడంతో ప్రాసిక్యూటర్లు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మారడోనా ట్రీట్ మెంట్ లో ఎన్నో లోపాలు ఉన్నాయని వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్నిఆయనకే వదిలేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏర్పాటు చేసిన 20 మంది వైద్య నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. సరిగా వైద్యం చేసి ఉంటే ఆయన బతికి ఉండేవారని పేర్కొంది. ఇక నిందితులుగా భావిస్తున్న ఏడుగురూ ఈ కమిటీ ఎదుట తమ వాంగ్మూలాలను ఇవ్వనున్నారు. ఈ విచారణ రెండు వారాల పాటు కొనసాగుతుంది.

అయితే మారడోనా వ్యక్తిగత వైద్యుడు మాత్రం ఈ కేసును కొట్టివేయాలని, మారడోనా తన చివరి రోజుల్లో ఎంతో డిప్రెషన్ కి గురవుతూ వచ్చాడని,, ఆయనకు ట్రీట్ మెంట్ లో తన లోపమేదీ లేదని అంటున్నారు. మారడోనాకు కొకైన్, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉండేది. అటు ఆయనకు వైద్య చికిత్స చేసిన ఆసుపత్రి డాక్టర్లు కూడా నిర్లక్ష్యం వహించారని మారడోనా తరఫు లాయర్ అంటున్నారు. కాగా ఏడుగురు నిందితులను దేశం వదిలి వెళ్లరాదని ప్రాసిక్యూటర్లు ఆదేశించారు. నేరం రుజువైతే వీరికి 8 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ జైలు శిక్ష పడవచ్చు.

మరిన్ని ఇక్కడ చూడండి: అనాథ అని చెప్పి నమ్మకంగా నటిస్తుంది.. అందినకాడికి దోచుకుంటుంది..! వెలుగులోకి వచ్చిన నిత్య పెళ్లికూతురు ఎవ్వారం..

Covid-19 Vaccine: వ్యాక్సిన్ తీసుకున్న వారికి బంపర్ ఆఫర్‌.. టీకా తీసుకోండి.. కారు గెలుచుకోండి