Covid-19 Vaccine: వ్యాక్సిన్ తీసుకున్న వారికి బంపర్ ఆఫర్‌.. టీకా తీసుకోండి.. కారు గెలుచుకోండి

Covid-19 Vaccine: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఒక వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరో వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది..

Covid-19 Vaccine: వ్యాక్సిన్ తీసుకున్న వారికి బంపర్ ఆఫర్‌.. టీకా తీసుకోండి.. కారు గెలుచుకోండి
Follow us

|

Updated on: Jun 14, 2021 | 10:43 AM

Covid-19 Vaccine: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఒక వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరో వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే నివాసితులకు లాటరీలో కార్లను అందించేందుకు మాస్కో ముందుకు వచ్చింది. రష్యా యొక్క మాస్కో, రెండు మోతాదుల కోవిడ్‌ వ్యాక్సిన్‌ మోతాదును తీసుకునే వారికి ప్రైజ్‌ డ్రాలో ఉచిత కార్లను అస్తామని మాస్కో మేయర్‌ మేయర్ సెర్గీ సోబయానిన్ వెల్లడించారు. ఈ డ్రా జూన్ 14 నుండి జూలై 11 వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి వారానికి 10 లక్షలకు పైగా విలువైన ఐదు కార్లు ఇవ్వబడతాయి అని ఆయన వెల్లడించారు. కరోనా టీకా తీసుకుంటే.. ఖరీదైన కారు సొంతం చేసుకునే అవకాశం దక్కుతుంది. అయితే కరోనా టీకాలు తీసుకోవాలంటూ ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కొత్త కొత్త పథకాలు, ప్రోత్సాహకాలతో ముందుకు వస్తున్నాయి. ఇటువంటి దేశాల జాబితాలో అమెరికా ముందుంది. బీర్లు, పిజ్లాలు వంటి పలు తాయిలాలా ఆశ చూపుతూ ప్రజలకు టీకాలు వేస్తోంది. ఇక రష్యా ప్రభుత్వం తాజాగా అమెరికాను తలదన్నే రీతిలో ఓ కొత్త ప్రయోగంతో ముందుకు వచ్చింది.

ఈ ఆఫర్ ప్రకారం.. కోవిడ్‌ టీకా తీసుకున్న వారి పేర్లతో ప్రభుత్వం లాటరీ నిర్వహిస్తుంది. ఇందులో గెలుపొందిన వారికి ఓ ఖరీదైన బహుమతిని ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. రష్యా రాజధాని మాస్కో నగర ప్రజలకు మాత్రమే ప్రభుత్వం ఈ టీకా లాటరీని నిర్వహిస్తోంది. ప్రతి వారం లాటరీ నిర్వహించి ఐదుగురు విజేతలను ఎంపిక చేస్తామని, వారిలో ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల విలువైన కార్లను బహుమతిగా ఇస్తామని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తాజాగా ప్రకటించారు. ప్రతి ఒక్కరు టీకా తీసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

New Covid Sensor: కొత్త కోవిడ్‌ సెన్సార్‌.. వాసన ద్వారా కోవిడ్‌ సోకిన వారిని గుర్తింపు

Covid 19 Third Wave: కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..?

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..