ఆ మొసలి పేరు ‘ఒసామా బిన్ లాడెన్’……ఎంతమందిని పొట్టన బెట్టుకుందంటే …..?

ఉగాండాలోని ఓ గ్రామంలో 'ఒసామా బిన్ లాడెన్' అని వ్యవహరిస్తున్న భారీ మొసలి కొన్నేళ్లుగా ఆ గ్రామవాసులను వణికించేస్తోంది.

ఆ మొసలి పేరు 'ఒసామా బిన్ లాడెన్'......ఎంతమందిని పొట్టన బెట్టుకుందంటే .....?
Crocodile Named Osama Bin L
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 14, 2021 | 2:24 PM

ఉగాండాలోని ఓ గ్రామంలో ‘ఒసామా బిన్ లాడెన్’ అని వ్యవహరిస్తున్న భారీ మొసలి కొన్నేళ్లుగా ఆ గ్రామవాసులను వణికించేస్తోంది. 16 అడుగుల పొడవైన దీని వయస్సు సుమారు 75 ఏళ్ళని భావిస్తున్నారు. 1991-2005 మధ్య కాలంలో ఇది 80 మందిని చంపేసిందని లుగాంగా గ్రామ వాసులు అంటున్నారు. నదిలో నీటిని తీసుకునేందుకు వచ్చే ఎంతోమంది పిల్లలపై ఇది దాడి చేసిందని ఇప్పటికీ స్థానికులు భయంతో చెబుతున్నారు. చేపలు పట్టడానికి పడవల్లో వచ్చేవారిపై ఇది అతి లాఘవంగా ఎటాక్ చేస్తూ వచ్చిందని గ్రామ పెద్దలు తెలిపారు. రెప్ప పాటులో ఇది తన ‘టార్గెట్’ ను నీటిలోపలికి లాక్కుని పోతుందని వారు చెప్పారు. బోట్ల ఆడుగు భాగం నుంచి ఒక్క ఉదుటున పైకి లేచి వాటిని తలకిందులు చేసేస్తుందని అన్నారు. . పాల్ అనే జాలరి తన సోదరుడిని అది తన కళ్ళముందే లాక్కు పోతున్నా తానేమీ చేయలేకపోయానన్నాడు. ఇన్నేళ్లయినా ఆ క్రోకడైల్ ని తలచుకుంటేనే వణికిపోతామని అన్నాడు. ఎన్నో రాత్రుళ్ళు తాము నిద్రలేకుండా గడిపామని, చివరకు దీని విషయమై వన్యమృగ సంరక్షణా కేంద్ర అధికారులకు తెలిపామని పాల్ పేర్కొన్నాడు.

ఆ అధికారుల సాయంతో దాదాపు 50 మంది ఈ భారీ మొసలిని పట్టుకోగలిగారు. ఇందుకు సుమారు అయిదారు గంటలు పట్టిందట. తమ గ్రామ వాసులను 80 మందినిపొట్టన బెట్టుకున్న దీన్ని చంపేయాలని స్థానాయికులు కోరగా అధికారులు మాత్రం వద్దంటూ దీన్ని ఉగాండాలో మొసళ్ల పెంపకందారులు తరలించాలని నిర్ణయించారట.. సిడ్నీ మార్నింగ్ అనే పత్రిక ఈ విషయాలను తెలియజేసింది. మొసళ్ల పెంపకందారులు దీన్ని బ్రీడింగ్ కోసం తీసుకున్నారని, మొసళ్ల చర్మాల అమ్మకం ద్వారా వాళ్ళు అధికంగా డబ్బులు సంపాదిస్తున్నారని ఈ పత్రిక పేర్కొంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Coronavirus Second Wave: కరోనా మొదటి వేవ్ కంటె రెండో వేవ్ ఉధృతంగా వచ్చింది..అంతే వేగంగా అదుపులోకి వస్తోంది..

Income Inequalities: కూడబెట్టిన సొమ్మును మహమ్మారి మింగేసింది.. ధనిక- పేదల మధ్య ఆర్థిక అంతరం పెరిగిందిః ఆర్‌బీఐ మాజీ గవర్నర్