Digestive Problems : కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో జీర్ణ సమస్యలు..! సెకండ్ వేవ్‌లో పెరుగుతున్న ఈ రకం కేసులు..
Digestive Problems : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు ఇప్పుడు
Digestive Problems : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు ఇప్పుడు కొత్తరకం సమస్యలు వచ్చిపడుతున్నాయి. కోవిడ్ 19 సంక్రమణలో ఆకలి, వికారం, వాంతులు, విరేచనాలు, ఉదరం నొప్పితో బాధపడిన రోగులు కోవిడ్ నుంచి కోలుకున్నాక ఉబ్బరం, వాయువు, ఆమ్లత్వం, యాసిడ్ రిఫ్లక్స్, మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ తీవ్రత వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఇటువంటి వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. కోవిడ్ -19 చికిత్సలో బహుళ ఔషధ కలయికలు ఉన్నాయి. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్, యాంటీ ఫంగల్స్, యాంటీమలేరియల్స్, స్టెరాయిడ్స్ చాలా మంది రోగులలో ఉపయోగించాల్సిన అవసరం ఉంది. దీంతో రికవరీ దశలో గ్యాస్ట్రో-పేగు వ్యవస్థపై నష్టాన్ని కలిగిస్తున్నాయి.
ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం, మంచి నిద్ర, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు కచ్చితంగా అవసరం. గత సంవత్సరం దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్డౌన్ పురోగమిస్తున్నందున వంటపై పెరిగిన ఆసక్తిని ప్రతిబింబిస్తూ సోషల్ మీడియాలో ఆహారం, వంట సంబంధిత పోస్టుల ప్రవాహం వెల్లువలా వచ్చి పడింది. వాటిని తరచుగా రుచి చూడటం చాలా మందికి ఓదార్పునిచ్చింది. అదనంగా బయటి ఆహార వినియోగం కూడా పెరిగింది. రెస్టారెంట్లు మూసివేయకపోవడంతో హోమ్ డెలివరీ ఆర్డర్లు పెరుగుదలను చూపించాయి. దీంతో ప్రజలు ఇంట్లోనే ఉండి అధిక కాలరీలు గల ఆహారం తీసుకొని శారీరక శ్రమ చేయకపోవడంతో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. దీంతో ఆరోగ్యం చెడిపోయి ఈ ప్రభావం జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.
జీర్ణశయాంతర సమస్యలను జాగ్రత్తగా చూసుకోవడం అవసరం.క్రమశిక్షణతో కూడిన దినచర్యను కలిగి ఉండాలి, కాలరీలు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం మానుకోవాలి. చక్కెర నుంచి దూరంగా ఉండటం మంచిది. బయటి నుండి ఆహారాన్ని చాలా తరచుగా ఆర్డర్ చేయకుండా ప్రయత్నించండి. సమయానికి తినండి అర్థరాత్రి భోజనం మానుకోండి. సలాడ్లు, పండ్లు, పెరుగును ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చండి. అలాగే అతిగా తినడం అధిక చిరుతిండిని నివారించడానికి ప్రయత్నించండి. టీ, కాఫీ తీసుకోవడం రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు పరిమితం చేయండి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి. చివరగా ఆరోగ్యానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.