Mass Rape of a Dumb Girl : వరంగల్ జిల్లాలో దారుణ ఘటన.. మూగ యువతిపై సామూహిక అత్యాచారం..

Mass Rape of a Dumb Girl : ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని శిక్షలు వేసినా మహిళలు, యువతులపై అఘాయిత్యాలు ఆగడం లేదు.

Mass Rape of a Dumb Girl : వరంగల్ జిల్లాలో దారుణ ఘటన.. మూగ యువతిపై సామూహిక అత్యాచారం..
Mentally challenged woman Raped

Mass Rape of a Dumb Girl : ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని శిక్షలు వేసినా మహిళలు, యువతులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మృగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. మానవత్వం మరిచి అత్యంత నీచమైన పనులు చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లా రంగశాయిపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కళ్లు కనపడని అమ్మమ్మకు ఆసరాగా ఉండటం కోసం వచ్చిన ఓ మూగయువతిపై ముగ్గురు కుర్రాళ్లు కన్నేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్‌కు చెందిన ఓ మూగ యువతి తల్లి గతంలోనే చనిపోయింది. ఇటీవల తండ్రి పనిమీద బయటకెళ్లడంతో సమీపంలో ఉండే తన అమ్మమ్మ ఇంటికి ఆమెకు తోడుగా ఉండేందుకు వెళ్లింది. ఆ యువతిపై కన్నేసిన ముగ్గురు బాలురు ఇంట్లోకి వచ్చి మాయమాటలు చెప్పి యువతిపై దారుణానికి ఒడిగట్టారు. అక్కడే ఉన్న అమ్మమ్మకు చూపు సరిగా లేకపోవడంతో ఆమెకు అనుమానం రాకుండా మాటల్లోకి దింపారు. ఒకరి తర్వాత ఒకరు మనవరాలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తండ్రి ఇంటికి రాగానే ఆ యువతి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. వెంటనే ఆయన మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Etela Rajender: ఇవాళ బీజేపీలో చేరనున్న ఈటల రాజేందర్‌.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి…

Inter Online Classes: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్.. జూలై 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు.. వివరాలు

Israel New Prime Minister: ఇజ్రాయెల్‌లో పెద్ద మార్పు.. నెతన్యాహు ఔట్.. నఫ్తాలీ బెన్నెట్‌ ఇన్..