Israel New Prime Minister: ఇజ్రాయెల్‌లో పెద్ద మార్పు.. నెతన్యాహు ఔట్.. నఫ్తాలీ బెన్నెట్‌ ఇన్..

ఇజ్రాయెల్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు 12 ఏళ్ల పాలన ముగిసింది. దీంతో ఇజ్రాయెల్‌ పార్లమెంట్ నెసెట్‌ ఆదివారం సమావేశమై కొత్త ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్‌ను ఎన్నుకుంది.

Israel New Prime Minister: ఇజ్రాయెల్‌లో పెద్ద మార్పు.. నెతన్యాహు ఔట్.. నఫ్తాలీ బెన్నెట్‌ ఇన్..
Naftali Bennett
Follow us

|

Updated on: Jun 14, 2021 | 7:39 AM

ఇజ్రాయెల్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు 12 ఏళ్ల పాలన ముగిసింది. దీంతో ఇజ్రాయెల్‌ పార్లమెంట్ నెసెట్‌ ఆదివారం సమావేశమై కొత్త ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్‌ను ఎన్నుకుంది. 120 మంది సభ్యులు గల నెసెట్‌లో సైద్ధాంతికంగా భిన్న పార్టీలతో కూడిన కూటమికి అనుకూలంగా 60 మంది, వ్యతిరేకంగా 59 మంది ఓటు వేశారు. దీంతో నెతన్యాహు ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త ప్రధానిగా నియమితులైన నఫ్తాలీ బెన్నెట్‌ మరో రెండేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. కొత్తగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో 8 పార్టీలు ఉన్నాయి. వీటిలో ఓ అరబ్‌ పార్టీ కూడా ఉంది. ఇజ్రాయెల్‌ చరిత్రలో ఓ అరబ్‌ పార్టీ ప్రభుత్వంలో చేరడం ఇదే తొలిసారి.

రెండేళ్లలో నాలుగుసార్లు ఎన్నికలు..

120 మంది సభ్యులుగా పార్లమెంట్‌ నెస్సెట్‌కు గత రెండేళ్లలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల్లో ఏ పార్టీకి తగినంత మెజారిటీ రాకపోవడంతో బెంజమిన్‌ నెతన్యాహు సారథ్యంలోని లిక్‌డ్‌ పార్టీ మరోపార్టీతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగించింది. ప్రధాని పదవిని ఇరు పార్టీలు పంచుకోవాలని అప్పుడు నిర్ణయించుకున్నాయి.

ఇజ్రాయెల్‌కు నూతన ప్రధానిగా నియమితులైన 49 ఏళ్ల నఫ్తాలీ బెన్నెట్‌ దేశంలో ప్రముఖ మిలియనీర్‌గా పేరు పొందారు. బెన్నెట్‌ తల్లిదండ్రులు అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు వలస వచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు బెన్నెట్‌ ఓ టెక్‌ కంపెనీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు గడించించారు. మతపరమైన జాతీయవాదిగా రాజకీయాల్లో తనపై ముద్ర ఉంది. 2013లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వంలో బెన్నెట్‌ రక్షణ, విద్య, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు.

12 ఏళ్ల పాటు నెతన్యాహు…

ఇక ఇజ్రాయెల్‌కకు నెతన్యాహు 12 ఏళ్ల నుంచి ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. 1996-99 మధ్య తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆ తర్వాత 2009లో రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ఈ పదవిలో కొనసాగారు.

ఇవి కూడా చదవండి: IRCTC Latest News: ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న స్పెషల్ ట్రైన్లు.. తిరిగి ప్రారంభమవుతున్న రైళ్లు ఇవే..

SBI Customer Alart: ఇలా చేస్తే మీరు ఇబ్బందులు పడాల్సిందే.. మరోసారి ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో